Sugarcane Juice Risks: సమ్మర్ లో చెరుకు రసం ఎక్కువగా తాగిస్తున్నారా.. అయితే జాగ్రత్త?

ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటికి రావాలి అంటేనే భయ

  • Written By:
  • Publish Date - June 11, 2023 / 09:30 PM IST

ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటికి రావాలి అంటేనే భయపడుతున్నారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే వేసవికాలం వచ్చింది అంటే చాలు ఎక్కువ శాతం ఆహారం కంటే పానీయాలే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పానీయాలలో ఎక్కువ శాతం ఇష్టపడేది చెరుకు రసం. బాగా మిట్ట మధ్యాహ్నం సమయంలో ఒక గ్లాసు చెరుకు రసంలో నాలుగు ఐదు ఐసు ముక్కలు కొంచెం ఐస్ వేసుకొని చల్లగా తాగితే కడుపులో చల్లగా ఉంటుంది. అయితే ఎక్కువగా వేసవిలో తిరిగిన వారు ఒక్కొక్కసారి రెండు మూడు గ్లాసులు తాగేస్తూ ఉంటారు.

కొంతమంది రోజు మొత్తంలో రెండు మూడు సార్లు తాగుతూ ఉంటారు. ఎండాకాలంలో చల్లగా ఉండే చెరకు రసాన్ని తాగడం చాలా మందికి అలవాటు. దీని వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా తాగడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి చెరుకు రసం తాగడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చెరకు రసంతో ప్రధాన ఆరోగ్య ప్రమాదం బాక్టీరియా కంటామినేషన్. చాలా చోట్ల చెరకు రసం అపరిశుభ్రమైన పరిస్థితుల్లో తయారు చేస్తారు. దీని వల్ల సాల్మోనెల్లా, ఎస్చెరిచియా కోలి, విబ్రియో కలరా వంటి హానికరమైన బాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ బాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

చెరకు రసంలో సహజంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం లేదా ఇతర పరిస్థితులతో బాధపడేవారికి వారికి ఆరోగ్యంగా అంత మంచిది కాదు. చెరకు రసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది హైపర్లైసీమియాకు కారణమవుతుంది. అధిక చక్కెర వినియోగం వల్ల బరువు పెరగడం సహా ఇతర ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తుంది. కాగా చెరకు రసం హైడ్రేటింగ్‌గా ఉండటంతో పాటు మూత్ర ఉత్పత్తిని ఎక్కువ చేస్తుంది. దీని వల్ల శరీరం నీటిని కోల్పోయి డీ హైడ్రేషన్ కు గురవుతారు. వేడి వాతావరణం కారణంగా డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉన్న ఎండాకాలంలో ఇది మరింత తీవ్రంగా ఉంటుంది. డీహైడ్రేషన్ అలసట, మైకం, హీట్ స్ట్రోక్‌తో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. చెరకు రసం ఆమ్లంగా ఉంటుంది. తరచూ చెరకు రసం తాగడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతింటుంది. ఇది దంత క్షయం, ఇతర దంత సమస్యలకు దారితీస్తుంది. సరైన నోటి పరిశుభ్రత పద్ధతులు లేకుండా క్రమం తప్పకుండా చెరకు రసం తాగడం వల్ల దంతాలకు తీవ్రమైన హాని కలుగుతుంది. కాబట్టి చెరుకు రసం తాగడం మంచిదే కానీ మితిమీరి తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవు.