ఆరోగ్యంగా ఉండాలి అంటే పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం తీసుకునే విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు కూడా తప్పనిసరి. లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అయితే ఆహారం విషయంలో కొంతమంది తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక సమస్యలు వస్తాయని రోగాల బారిన పడేలా చేస్తాయని చెబుతున్నారు. అటువంటి వాటిలో ఉదయం పరగడుపున బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ తినడం ఒకటి. ప్రతి రోజూ మీరు ఉదయం పరిగడుపున వీటిని తింటే ఆరోగ్యం ఖచ్చితంగా దెబ్బతింటుందట. బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయని, ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను ఫాస్ట్ గా పెంచడమే కాకుండా మిమ్మల్ని ఎన్నో వ్యాధుల బారిన పడేస్తుందని చెబుతున్నారు.
పరగడుపున మీరు బ్రెడ్ ను తింటే మీకు డయాబెటీస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందట. ఇప్పటికే షుగర్ ఉన్నట్టైతే మీరు మర్చిపోయి కూడా పరిగడుపున బ్రెడ్ ను తినకూడదని, నిజానికి వైట్ బ్రెడ్ త్వరగా జీర్ణమై గ్లూకోజ్ గా మారుతుందని, ఇది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను ఫాస్ట్ గా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది మీ శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుందట. అందుకే డయాబెటిస్ పేషెంట్లు ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతో బ్రెడ్ ను తినకూడదని, దీనికి బదులుగా ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలని చెబుతున్నారు.
అలాగే మీరు బరువు పెరగొద్దు అనుకుంటే మాత్రం మర్చిపోయి కూడా పరగడుపున బ్రెడ్ ను తినకూడదట. ఎందుకంటే బ్రెడ్ లో ఉండే ఎక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్లు మీ బరువును మరింత పెంచుతాయట. అంతేకాకుండా ఖాళీ కడుపుతో బ్రెడ్ ను తినడం వల్ల మీకు చాలా త్వరగా ఆకలి అవుతుందని, త్వరగా జీర్ణమయ్యే బ్రెడ్ కొన్ని కొన్నిసార్లు అతిగా తినడానికి దారితీస్తుందని,ఇది ఊబకాయం బారిన పడేస్తుందని,అందుకే ఉదయం బ్రెడ్ కు బదులుగా పండ్లు, కూరగాయలు లేదా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలని చెబుతున్నారు. పరిగడుపున బ్రెడ్ ను తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుందట. ఎందుకంటే బ్రెడ్ ను పిండితో తయారు చేస్తారు.కాబట్టి దీన్ని తినడం వల్ల మలం గట్టిపడుతుందట. అలాగే కడుపు శుభ్రం చేయబడదు. ఈ సమస్య మలబద్ధకానికి దారితీస్తుందని ఇప్పటికే మలబద్దకం సమస్య ఉన్నట్టైతే ఉదయాన్నే బ్రెడ్ ను తినక పోవడమే మంచిదని చెబుతున్నారు..