Site icon HashtagU Telugu

‎Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్ మంచిదే కానీ.. వీరికి మాత్రం విషంతో సమానం!

Beetroot Juice

Beetroot Juice

‎Beetroot Juice: మన వంటింట్లో దొరికే కూరగాయలలో బీట్ రూట్ కూడా ఒకటి. కాగా బీట్ రూట్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. బీట్ రూట్ ఉపయోగించి ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అలాగే బీట్ రూట్ జ్యూస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తాగడం వల్ల వెయిట్ లాస్ నుంచి శరీరంలో రక్తం పెరగడం వరకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. కానీ కొంతమంది ఈ బీట్ రూట్ జ్యూస్ ను అస్సలు తాగకూడదట. ఎందుకంటే ఇది వీళ్లకు విషం లాగా పనిచేస్తుందని చెబుతున్నారు.

‎ అలాగే బీట్ రూట్ జ్యూస్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీన్ని తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందట అలాగే బరువు తగ్గడానికి, శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఇలా ఎన్నో విధాలుగా బీట్ రూట్ జ్యూస్ సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే ఇది అందరికి మంచిది కాదట. కొందరికి ఇది విషయంతో సమానం అని చెబుతున్నారు. అధిక రక్తపోటు ఉన్నవారికి బీట్ రూట్ జ్యూస్ చాలా మంచిదట. ఇది రక్తపోటును తగ్గించడానికి, నియంత్రించడానికి బాగా సహాయపడుతుందని, తక్కువ రక్తపోటు ఉన్నవారు దీన్ని తాగితే బీపీ మరింత తగ్గుతుందని అందుకే వీరు తాగకూడదని చెబుతున్నారు.

‎అలాగే బీపీని కంట్రోల్ చేయడానికి మందులను ఉపయోగిస్తున్న వారు కూడా బీట్ రూట్ జ్యూస్ ను తాగకూడదట. ఎందుకంటే ఇది బీపీ మరింత తగ్గించి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందట. బీపీ తక్కువగా ఉన్నవారు, బీపీ మందులను వాడేవారు ఈ జ్యూస్ ను తాగితే తలతిరగడం, కళ్లు తిరగడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాగా కొంతమందికి బీట్ రూట్ కూడా పడకపోవచ్చు. అంటే దీనికి కూడా అలెర్జీ ఉండవచ్చు. ఇలాంటి వారు బీట్ రూట్ జ్యూస్ తాగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాపు, దురద వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాగా బీట్ రూట్ ఫైబర్ కు మంచి వనరు. కానీ ఇది తింటే కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి.

‎ముఖ్యంగా ఇది పేగు సంబంధిత సమస్యలు ఉన్నవారిపై చెడు ప్రభావం చూపుతుందట. అందుకే ఇలాంటి వారు బీట్ రూట్ జ్యూస్ ను తాగే ముందు ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలని చెబుతున్నారు. బీట్ రూట్ జ్యూస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు. అందుకే డాక్టర్ ను సంప్రదించకుండా డయాబెటీస్ ఉన్నవారు బీట్ రూట్ జ్యూస్ ను అస్సలు తాగకూడదని చెబుతున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారు బీట్‌రూట్ జ్యూస్ అస్సలు తాగకూడదట. ఎందుకంటే ఇందులో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయని,ఇవి కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తాయని చెబుతున్నారు.

Exit mobile version