Site icon HashtagU Telugu

Health Tips: వామ్మో.. అధిక బరువు ఉంటే ఏకంగా అన్ని రకాల సమస్యలు వస్తాయా?

Health Tips

Health Tips

ఇటీవల కాలంలో అధిక బరువు అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. అయితే బరువు పెరగడం అన్నది ఈజీనే కానీ బరువు తగ్గడం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇందుకోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గడం కోసం వాకింగ్ చేయడం జిమ్ కి వెళ్లడం డైట్ ఫాలో అవ్వడం ఆహారం తినడం మానేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా కూడా అధిక బరువు మాత్రం తగ్గరు. అయితే కొంతమంది అధిక బరువు ఉంటే ఏమీ కాదని లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ అధిక బరువు అనేక రకాల సమస్యలను తెచ్చి పడుతుందని చెబుతున్నారు. మరి అధిక బరువుతో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొన్నిసార్లు ఎక్కువ తినడం వల్ల అధిక బరువు పెరిగితే మరికొన్నిసార్లు ఊబకాయం కారణంగా కూడా అధిక బరువు సమస్య వస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ అధిక బరువు వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అన్న విషయాన్ని వస్తే.. స్థూలకాయం కారణంగా శరీరంలో మంట పెరగడం మొదలవుతుందట. ఇది మన రక్త నాళాలపై ఒత్తిడిని కలిగిస్తుందని,దీంతో రక్తపోటు పెరుగుతుందని అధిక రక్తపోటు గుండె ఆరోగ్యానికి చాలా డేంజర్ అని చెబుతున్నారు. అలాగే దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా బాగా పెరుగుతుందట. అలాగే ఊబకాయం కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా పెంచుతుందని చెబుతున్నారు..ఎందుకంటే ఇది ధమనులను ఇరుగ్గా మారుస్తుందట. దీంతో గుండె పోటు, స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందట.

అదేవిధంగా ఊబకాయం కారణంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయట. శరీరంలో మంట పెరుగుతుందని ఇది ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుందని చెబుతున్నారు. శరీరంలో ఇన్సులిన్ పెరగడం వల్ల మీ శరీరం ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయట. అదేవిధంగా అధిక బరువు కారణంగా కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుందట. దీనివల్ల కాలేయం వాపు వస్తుందని ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఈ సమస్యకు చికిత్స లేకపోవడం వల్ల ఇది లివర్ సిరోసిస్ కు కూడా కారణమవుతుందని,దీనివల్ల కాలేయం దెబ్బతినడం ప్రారంభమవుతుందని, అలాగే ఇది క్యాన్సర్ రిస్క్ ను కూడా పెంచుతుందని చెబుతున్నారు. శరీర బరువు పెరగడం వల్ల ఆ కీళ్లపై అధిక ఒత్తిడి పడుతుందట. దీనివల్ల ఎముకలు అరిగిపోవడం మొదలవుతుందట.

అలాగే ఊబకాయం వల్ల కీళ్లలో వాపు కూడా వస్తుందని దీంతో ఎముకల నొప్పి కూడా వస్తుందని దీన్నే అర్ధరాత్రి ఆర్థరైటిస్ అంటారని చెబుతున్నారు. సాధారణంగా ఇది వయస్సు పెరిగే కొద్దీ వస్తుందట. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీనపడతాయట. ఊబకాయం వల్ల శరీరంలోని కొవ్వు పెరిగి శరీరంలోని ప్రతి భాగంలో పేరుకుపోతుందట. గొంతులో కొవ్వు ఎక్కువగా ఉంటే నిటారుగా నిద్రపోవడానికి ఇబ్బంది పడతారట, వల్ల గాలి పైపు బ్లాక్ కావడం ప్రారంభమవుతుందట. దీనిని స్లీప్ అప్నియా అంటారు. స్లీప్ అప్నియా వల్ల నిద్రపోతున్నప్పుడు ఎక్కువగా శ్వాస ఆగిపోతుంది. దీని వల్ల నిద్రపోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే కంటినిండా నిద్ర పోరు. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుందని చెబుతున్నారు. వీటితో పాటుగా క్యాన్సర్ డిప్రెషన్ అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు.