మనం తినే ఫుడ్ ఒక్కో టేస్ట్ ఎక్కువగా ఉండాలని ఒక్కొక్కరు వారికి నచ్చినట్టు కోరుకుంటారు. ఇటీవల చాలామంది స్పైసీ గా(Spicy Food )ఉన్నవి ఎక్కువగా తింటున్నారు. రెస్టారెంట్స్ కి వెళ్లినా, బయట రోడ్ల మీద అయినా తమ ఫుడ్ ని మరింత స్పైసీ చేయమని అడుగుతున్నారు. అయితే ఎక్కువగా స్పైసీగా ఉన్న ఆహారపదార్థాలను తినడం వలన మనకు ఆరోగ్య సమస్యలు(Health Problems) వస్తాయి.
స్పైసీగా ఉన్న ఆహరం ఎక్కువగా తినడం వలన కడుపులో అల్సర్లు, పుండ్లు వచ్చే అవకాశం ఉంది. ఎర్ర మిరపకాయలలో ఉండే అఫ్లాటాక్సిన్ మన శరీరంలో ప్రేగు క్యాన్సర్, కడుపులో పూతలు, లివర్ సిర్రోసిస్ వంటివి పెంచే అవకాశం ఉంది. స్పైసీగా ఉన్నవి ఎక్కువగా తినడం వలన మనకు గ్యాస్ట్రిక్ అల్సర్లు వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. కారంలో ఉండే క్యాప్సైసిన్ అనేది మన గొంతు, నోరు, శ్వాస కోశం పొరల్లో ఇబ్బందిని కలిగిస్తాయి. అంతేకాకుండా విరోచనాలు వచ్చే అవకాశం ఉంది.
జీర్ణశయాంతర సమస్యలు ఉన్నవారు స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉండడం మంచిది లేకపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. స్పైసీగా ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వలన శ్వాసకోశ సమస్యలు, ఎక్కువగా దగ్గు వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం స్పైసీ పదార్థాలు రోజూ తింటే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆహారంలో తగినంత కారం ఉంటే సరిపోతుంది. అవసరానికి మించి స్పైసీ ఉంటే ఇలాంటి పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిందే.
Also Read : Sweet Potato : చలికాలంలో చిలకడదుంప తినడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా?