Site icon HashtagU Telugu

Beer: వేసవికాలంలో బీర్లు ఎక్కువగా తాగుతున్నారా.. అయితే బకెట్ తన్నేయడం ఖాయం!

Beer

Beer

ఇటీవల కాలంలో కాలం మారిపోవడంతో కాలంతో పాటు కొంతమంది చెడు అలవాట్లు కూడా నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా 20 ఏళ్ల లోపు పిల్లలనుంచి బీరు మందు తాగడం, సిగరెట్ తాగడం వంటివి అలవాటు చేసుకుంటున్నారు. కొంతమంది ఎప్పుడో ఒకసారి తాగితే మరి కొంతమంది ప్రతి రోజు లేదంటే వారానికి రెండు మూడు సార్లు ఎక్కువ మొత్తంలో బీర్లు తాగుతూ ఉంటారు. అయితే బీరు ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ శృతి నుంచి తాగడం మంచి మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఈ వేసవికాలంలో బీరు ఎక్కువగా తాగడం మంచిది కాదని చెబుతున్నారు. మరి వేసవిలో బీరు ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బీర్‌లో చాలా ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి రోజుకో బీర్ తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. రోజూ బీర్ తాగడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుందని, దీని వల్ల ఊబకాయం సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అలాగే మన శరీరంలో అత్యంత కీలకమైన పార్ట్ కాలేయం. కానీ ఎక్కువగా బీర్ తాగడం, కాలేయం మీద నెగటివ్ ప్రభావం చూపుతుందట. కాలేయం మెటాబలిజం, ఫిల్టరేషన్ ప్రక్రియలను నిర్వహించే ముఖ్యమైన అవయవం. కాబట్టి వీటిపై ప్రభావం పడితే, శరీరంలో విషపదార్థాల ప్రవాహం పెరిగిపోవచ్చట. కాగా ప్రతీ రోజూ బీర్ తాగడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

హృదయ స్పందనకు సంబంధించిన సమస్యలు, హార్ట్ అటాక్‌ కి దారితీస్తాయని చెబుతున్నారు. ఎక్కువగా బీర్ తాగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. బీర్ తాగడం రాత్రి నిద్రపై కూడా ప్రభావం చూపిస్తుందట. రాత్రి బీర్ తాగడం వల్ల నిద్రకు ఆటంకం ఏర్పడుతుందట..మనం బీర్ తాగిన తరువాత నిద్రలో అంతరాయాలు కలుగుతాయట. దీంతో మానసిక ఆరోగ్యంపై నెగటివ్ ప్రభావం చూపిస్తుందట. మరింత జాగ్రత్త బీర్ తాగడం అలవాటు అయినా దీన్ని పరిమితం చేయడం అవసరం అని చెబుతున్నారు. కాబట్టి వేసవికాలంలో బీర్లు తాగడానికి బదులుగా పండ్ల రసాలు పండ్లు వంటివి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది అని చెబుతున్నారు.