Health Problems: పుట్టగొడుగులు మంచివే కదా అని ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త!

చాలామందికి పుట్టగొడుగులు అంటే చాలా ఇష్టం. అందుకే వీటిని తెగ ఇష్టపడి తింటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈ పొట్ట గొడుగుల వాడకం చాలా వరకు పెరిగిపోయింది

Published By: HashtagU Telugu Desk
Mixcollage 27 Dec 2023 06 29 Pm 8645

Mixcollage 27 Dec 2023 06 29 Pm 8645

చాలామందికి పుట్టగొడుగులు అంటే చాలా ఇష్టం. అందుకే వీటిని తెగ ఇష్టపడి తింటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈ పొట్ట గొడుగుల వాడకం చాలా వరకు పెరిగిపోయింది. ఈ పుట్టగొడుగులు మనకు ఏడాది పొడవునా మార్కెట్లలో సూపర్ మార్కెట్లలో లభిస్తూనే ఉన్నాయి. దీంతో చాలామంది కనీసం వారంలో రెండు మూడు సార్లు అయినా వీటిని తినడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా చాలామంది రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఈ పుట్టగొడుగులకు సంబంధించిన రెసిపీలను తింటూ ఉంటారు. పుట్టగొడుగుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అయితే పుట్టగొడుగులు మంచిదే కదా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం ప్రమాదాలు రావడం ఖాయం అని అంటున్నారు వైద్యులు. మరి పుట్టగొడుగుల ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పుట్టగొడుగులను అధికంగా తినడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులో తలనొప్పి కూడా ఒకటి. అందుకే వీటిని అధికంగా తీసుకోకుండా పరిమితిలో మాత్రమే తీసుకోవాలి. అలాగే వీటిని అధికంగా తినడం వలన అలసట, నీరసం లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. అలాగే అసౌకర్యంగా ఉండడంతో పాటు జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా తలెత్తుతాయి.

అలాగే ఈ పుట్టగొడుగులను ఎక్కువగా తినడం ద్వారా చర్మానికి సంబంధించిన అలర్జీలు వచ్చే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. కొందరిలో ఇది తీసుకోవడం వలన దద్దుర్లు కూడా వస్తాయి. అలాగే ఆలర్జీ ఎక్కువ అవుతూ ఉంటుంది. అదేవిధంగా వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన విరోచనాలు, వికారం, కడుపునొప్పి, వాంతులు కూడా అవుతాయి. అందుకే వీటిని తీసుకునేటప్పుడు పరిమితిగా మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా కాబట్టి అలర్జీ జీర్ణ సంబంధిత వ్యాధులు ఉన్నవారు, అసలు వీటిని తీసుకోకపోవడం మంచిది.

  Last Updated: 27 Dec 2023, 06:30 PM IST