Site icon HashtagU Telugu

Health Problems: వామ్మో.. మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర అంత డేంజరా?

Mixcollage 28 Dec 2023 06 25 Pm 8387

Mixcollage 28 Dec 2023 06 25 Pm 8387

మామూలుగా చాలామందికి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అలా కొద్దిసేపు పడుకోవడం అలవాటు. ఆఫీస్ వెళ్లే వారికి కూడా భోజనం చేసిన తర్వాత నిద్ర వస్తూ ఉంటుంది. అయితే మీకు తెలియని విషయం ఏమిటంటే భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం టైం పడుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. అసలు నిద్రపోవద్దు అని చెప్పడం లేదు కానీ ఒక అర్థగంట సేపు పడుకోవడం మంచిదే. కానీ అర్థగంట కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్ర వస్తున్నట్లు అనిపించి నిద్ర పట్టేసి గంటల తరబడి నిద్రిస్తూ ఉంటారు. దాని మూలంగా రాత్రి సమయంలో సరియైన నిద్ర పట్టదు. శరీరానికి సరియైన విశ్రాంతి కూడా దొరకదు. ఇది మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుంది. మధ్యాహ్నం పూట పదేపదే నిద్రపోయే వారిలో అధిక బరువు పెరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. మధ్యాహ్న టైంలో అధికంగా నిద్రపోయే వారిలో హార్ట్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఎక్కువసేపు పడుకోవడం కంటే తక్కువ టైం పడుకోవడం వలన ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి.

ఎక్కువసేపు పడుకోవడం వల్ల అది మీ ఒత్తిడిని దూరం చేస్తుంది. దీర్ఘకాలం నిద్ర పోవడం కంటే 30 నిమిషాలు వరకు నిద్రపోయేవారు ఆరోగ్యంగా ఉంటారు. మధ్యాహ్నం రకరకాల పనులు చేయడం వలన మన శరీరం అలసటకి గురవుతుంది. కాబట్టి తగినంత విశ్రాంతి శరీరం కోరుకుంటుంది. రాత్రి సమయంలో సరియైన నిద్రను పోవకపోవడం లాప్టాప్ లు, సిస్టం, ఫోన్లు, డ్రగ్స్, మద్యం తాగడం లాంటి వాటి వలన నిద్రకి భంగం కలిగిస్తుంది. పలువురు సరైన సమయంలో నిద్ర పోరు. ఇది అధిక పరిమాణాలకు కూడా దోహదపడుతుంది. కావున అందరూ రాత్రిపూట ఎనిమిది గంటలు నిద్రపోవడం అనేది ఆరోగ్యానికి శ్రేయస్కరం..