Health Problems: పచ్చి బొప్పాయి తింటున్నారా.. అయితే జాగ్రత్త మీరు డేంజర్ లో పడ్డట్టే?

బొప్పాయి పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల, చిగుళ్ళ ఆరోగ

  • Written By:
  • Publish Date - January 16, 2024 / 04:00 PM IST

బొప్పాయి పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. విటమిన్‌ బి నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. కెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలు బొప్పాయి పండులో పుష్కలంగా ఉంటాయి. కేవలం బొప్పాయి పండు మాత్రమే కాకుండా ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన శరీరంలో ప్లేట్ లైట్లు తగ్గినా బొప్పాయి జ్యూస్ తో పాటు ఆకుల రసాన్ని తాగిస్తారు.

అయితే పండిన బొప్పాయి మాత్రమే కాకుండా కొందరు పచ్చి బొప్పాయి కూడా తీసుకుంటూ ఉంటారు. మీకు తెలుసా పచ్చి బొప్పాయి ని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమట. ఇదే విషయాన్ని నిపుణులు చెబుతున్నారు. మరి పచ్చి బొప్పాయి తినడం వల్ల ఎటువంటి నష్టాలు కలుగుతాయో, ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పచ్చి బొప్పాయి మాత్రం చాలా డేంజర్. అది తింటే లేని లేని రోగాలు వస్తాయని అంటున్నారు నిపుణులు.. గర్భిణీ స్త్రీలను బొప్పాయి తినకూడదు అని చెబుతుంటారు. కానీ వైద్యులు మాత్రం బొప్పాయి పండు తింటే ఏం కాదు కాని, పచ్చిది మాత్రం తినొద్దని చెబుతున్నారు. పచ్చి బొప్పాయిలో ఉండే ప్రొటీయోలైటిక్ ఎంజైన్ అయిన పపైన్ అనే పదార్థం ఉంటుంది.

అది గర్భాశయం సంకోచం చెందేందుకు కారణం అవుతుంది. అది గర్భస్రావం జరిగేందుకు కారణం అవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ బొప్పాయి తినుకూడదు. అయితే పచ్చి బొప్పాయిని సరైన మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియకు మేలు కల్గుతుంది. కానీ ఎక్కువగా తింటే మాత్రం చాలా సమస్యలు తప్పవు. పపైన్ మూలకం జీర్ణ సమస్యలను కల్గిస్తుంది. దాంతో విపరీతమైన కడుపు నొప్పికి వస్తుంది. అంతే కాకుండా పచ్చి బొప్పాయి తినడం వల్ల వాంతులు కూడా అవుతాయి. అలాగే పచ్చి బొప్పాయి తినడం వల్ల గురక వంటి సమస్యలు కూడా వస్తాయి. దీని వల్ల ఆస్తమా రోగులకు అనేక సమస్యలు వస్తాయి. పచ్చి బొప్పాయిలో ఉండే తెల్లని పాల వల్ల ఎలర్జీ వస్తుంది. దీని వల్ల తలనొప్పి, దద్దుర్లు, తల తిరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్లు బొప్పాయి తినాలనుకుంటే మాత్రం వైద్యుల సలహాలు కచ్చితంగా తీసుకోవాల్సిందే.