Health Problems: కూల్ వాటర్ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త మీరు ప్రమాదంలో పడ్డట్టే?

మనలో చాలామందికి చల్లనీరు తాగే అలవాటు ఉంటుంది. వేసవికాలం చలికాలం అని సంబంధం లేకుండా చాలామంది చల్ల నీళ్లు తెగ తాగేస్తూ ఉంటారు. మరీ ము

  • Written By:
  • Publish Date - January 5, 2024 / 03:00 PM IST

మనలో చాలామందికి చల్లనీరు తాగే అలవాటు ఉంటుంది. వేసవికాలం చలికాలం అని సంబంధం లేకుండా చాలామంది చల్ల నీళ్లు తెగ తాగేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా కొందరు అయితే వేసవికాలంలో గడ్డలు కట్టే విధంగా ఉన్న నీటిని కూడా సునాయాసంగా తాగుతూ ఉంటారు. కూల్ వాటర్ తాగితే ఆరోగ్యానికి మంచిది అని బ్రమపడి తెగ తాగేస్తూ ఉంటారు. మీకు తెలుసా చల్లనీరు తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమట. ఇదే విషయాన్ని వైద్యులు కూడా చెబుతున్నారు. కూల్ వాట‌ర్ తాగితే అనారోగ్యానికి దారితీస్తుంద‌ట. కేవలం కూల్ వాటర్ మాత్రమే కాకుండా జ్యూసులు కూడా ఎక్కువగా తాగకూడదు.

ముఖ్యంగా చల్లగా ఉన్న జూసులను తెగ తాగేస్తూ ఉంటారు. అవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదట. మరి చల్లని నీరు లేదా చల్లని జ్యూసులు తాగడం వల్ల కలిగే సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది వేసవికాలంలో ఆహారానికి బదులుగా ఎక్కువగా కూల్ వాటర్ లేదా కూల్ జ్యూసులతో పొట్ట నింపేస్తూ ఉంటారు. ఇలా చేస్తే తిన్న ఆహారం తొందరగా జీర్ణం కాదు. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయి. అంతేకాకుండా అధిక‌బ‌రువుకి కార‌ణం అవుతుంది. అలాగే కూల్ వాట‌ర్ ఎక్కువ‌గా తాగితే జీర్ణ‌వ్య‌వ‌స్థ పాడ‌వుతుంది. గొంతునొప్పి వంటి ప్రాబ్లంమ్స్ క్రియేట్ చేస్తుంది.

అలాగే కూల్ వాట‌ర్ తాగితే త‌ల‌నొప్పి కూడా వ‌చ్చే ప్ర‌మాదం ఉందది. అయితే కొంద‌రు బోజ‌న చేసిన వెంట‌నే వాట‌ర్ తాగేస్తుంటారు. ఇలా చేస్తే ఆహారం జీర్ణ‌మ‌వ‌డంలో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందుకే బోజ‌నం చేసిన అర‌గంట త‌ర్వాత వాట‌ర్ తాగాలి. అలాగే బోజ‌నం చేసే అర‌గంట ముందు నీళ్లు తీసుకోవాలి. మొత్తంగా ప్ర‌తిరోజు నాలుగు లీట‌ర్ల‌కు పైగా వాట‌ర్ తీసుకుంటే బాడీ డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. అలాగే శ‌రీరంలోని మ‌లినాలు,టాక్సిన్స్ చెమ‌ట రూపంలో బ‌య‌ట‌కు పంప‌బ‌డ‌తాయి.