Health Problems: సీతాఫలాలను ఎక్కువగా తింటున్నారా.. అయితే ఆ సమస్య రావడం ఖాయం?

మనకు శీతాకాలంలో దొరికే పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. చాలామంది ఈ సీతాఫలాలను ఇష్టంగా తింటూ ఉంటారు. కొందరు అయితే కేజీలకు కేజీలు సీతాఫలం పండ్లను

Published By: HashtagU Telugu Desk
Mixcollage 22 Dec 2023 07 47 Pm 3485

Mixcollage 22 Dec 2023 07 47 Pm 3485

మనకు శీతాకాలంలో దొరికే పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. చాలామంది ఈ సీతాఫలాలను ఇష్టంగా తింటూ ఉంటారు. కొందరు అయితే కేజీలకు కేజీలు సీతాఫలం పండ్లను లాగించేస్తూ ఉంటారు. సీతాఫలం తినడం మంచిదే కానీ మితిమీరి ఎక్కువగా తింటే మాత్రం ప్రమాదం తప్పదు అంటున్నారు వైద్యులు. ఈ సీతాఫలం తినడానికి తియ్యగా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే సీతాఫలం చెట్టులోని ఆకులు, బెరడు, వేర్లు ఇలా ప్రతి భాగంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ గుణాలు శరీరంలో వ్యాధి కారకాలను తొలగించడానికి బాగా సహాయపడుతుంది. సీతాఫలంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

కావున ప్రతిరోజు ఈ పండుని తినడం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ గా వచ్చే అనేక వ్యాధులను ఈ సీతాఫలం పండ్లతో సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. సీతాఫలం పండులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. దీని ద్వారా అనీమియా వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. వంద గ్రాముల సీతాఫలంలో 94 క్యాలరీలు లభిస్తాయి. ఆపిల్, జామ, మామిడి బొప్పాయి బత్తాయి వంటి పండ్లతో పోలిస్తే అందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువ బరువుతో బాధపడేవారు ప్రతిరోజు సీతాఫలాన్ని ఆహారంగా తీసుకుంటే శరీరానికి శక్తి నిచ్చి బరువు పెరగడంలో సహాయపడుతుంది.

సీతాఫలం గుజ్జులో అధికంగా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. క్యాల్షియం ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడుతుంది. పొటాషియం రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటుకు దూరంగా ఉంచుతుంది. సీతాఫలం పండులో నియాసిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బులు దీర్ఘకాయ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. సీతాఫలం పండులో ఎసిటోజెనిన్ కెమికల్స్ చర్మ క్యాన్సర్ల నుండి కాపాడుతాయి. అలాగే ఈ పండులో ఉన్న ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. సీతాఫలంలో అత్యధిక క్యాలరీలు ఉండడం వలన అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఈ పండ్లను తినకూడదు. ఎక్కువగా తింటే క్యాలరీలు ఎక్కువగా ఉండడం వలన మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పండ్లను అతిగా తినకపోవడం మంచిది.

  Last Updated: 22 Dec 2023, 07:47 PM IST