Site icon HashtagU Telugu

Health Problems: రాత్రి పూట భోజనం చేసేటప్పుడు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిందే?

Mixcollage 14 Dec 2023 05 30 Pm 4051

Mixcollage 14 Dec 2023 05 30 Pm 4051

మామూలుగా మనం భోజనం చేసేటప్పుడు తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాం. వాటి వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే చాలామంది ఈ రాత్రి సమయంలో హెవీగా భోజనం చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం సమయంతో పోల్చుకుంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా ఆహారం తీసుకుంటూ ఉంటారు. రాత్రి సమయంలో ఎక్కువగా ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. అలాగే రాత్రిపూట భోజనం చేసే విషయంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు. మరి రాత్రిపూట భోజనం చేసేటప్పుడు ఎటువంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రాత్రిపూట భోజనం విషయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే విపరీతమైన బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. రాత్రి భోజనంలో ఏం తీసుకోవాలని అనుమానం చాలామందికి కలుగుతూ ఉంటుంది. మొదట ప్రాసెస్ చేసిన ఆహారాలకి దూరంగా ఉండాలి. వీలైతే వాటిని పూర్తిగా మానుకోవాలి. పిండిపదార్ధాలు రాత్రి భోజనంలో తీసుకోవద్దు. పప్పులు కూరగాయలు తృణ ధాన్యాలు లాంటి వాటిని తీసుకోవచ్చు. అలాగే చేపలు, చికెన్, జున్ను లాంటివి ప్రోటీన్లు తీసుకోవచ్చు. సలాడ్లు కూడా తీసుకోవచ్చు. వాటి ద్వారా శరీరానికి ఫైబర్ అందుతుంది. ఇది పొట్టను శుభ్రంగా చేయడంలో ఉపయోగపడుతుంది.

అల్పాహారం భోజనం కంటే రాత్రి భోజనం చాలా తక్కువగా తీసుకోవాలంటున్నారు. డైజేషన్లు రాత్రి భోజనం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే రోజు చివర్లో మన జీర్ణక్రియ చాలామంది అలాగే షుగర్, ఊబకాయం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలలో రాత్రి ఎనిమిది గంటలు లోపే డిన్నర్ చేయాలి. అంటే నిద్రపోవడానికి కనీసం మూడు గంటల ముందు డిన్నర్ తినేసేయాలి. డిన్నర్ ఎప్పుడు లైట్ గానే తీసుకోవాలి. తొందరగా తీసుకోవాలి. కావున ముందుగానే ఫుడ్ రెడీగా ఉండేలా చూసుకోవాలి ఆఫీస్ లో ఉన్న ఇంట్లో ఉన్న బయటకి వెళ్ళిన తొందరగా డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి.

Exit mobile version