Site icon HashtagU Telugu

Health Problems: నాన్ వెజ్ తిని కాఫీ తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే?

Mixcollage 02 Jan 2024 04 41 Pm 3515

Mixcollage 02 Jan 2024 04 41 Pm 3515

కాఫీ, టీ.. ఇందులో తెలియని ఏదో ఒక సంతోషం ఎమోషన్ దాగి ఉందని చెప్పవచ్చు. బాధ వచ్చిన సంతోషం వచ్చినా, కోపం వచ్చినా కూడా ఒక్క కాఫీ టీ లేదా టీ తాగితే చాలని అనుకుంటూ ఉంటారు. అలా ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమంది ఎనిమిది మంది కాఫీ టీలకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఒక్క పూట భోజనం లేకుండా అయినా ఉండగలరేమో కానీ ఒక్కరోజు కాఫీ టీలు తాగకపోతే అసలు ఉండలేరు. ఉద‌యం, సాయంత్రం త‌ప్ప‌నిస‌రిగా కాఫీని తాగుతారు. కాఫీ తాగడం ఒక రోజువారి అల‌వాటుగా మారిపోయింది. ఎక్క‌డ ఉన్నా దాని వాస‌న‌ను ప‌సిగ‌ట్టే అంత‌లా కాఫీకి అల‌వాటు ప‌డిపోయారు.

కాఫీ టీ తాగడం మంచిదే కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాఫీ తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకునే ముందు తీసుకున్న తర్వాత ఈ కాఫీ టీ లకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా నాన్ వెజ్ తిన్న తర్వాత కాఫీ లేదా టీ అస్సలు తాగకూడదు అంటున్నారు వైద్యులు. అలాగే బ‌ఠానీలు, చిక్కుళ్లు, సోయాసాస్ లాంటివి కాఫీ తాగే ముందు అస్స‌లు తిన‌కూడ‌దు. ఎందుకంటే వీటిలో ఐర‌న్ శాతం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక వీటిని తిన్నాక కాఫీ త్రాగ‌రాదు. మ‌నకు ఐర‌న్ రెండు రూపాల్లో ల‌భిస్తుంది. ఒక‌టి హిమ్, మ‌రొక‌టి నాన్ హీమ్. హీమ్ ఐర‌న్ జంతువుల నుంచి ల‌భిస్తుంది. ఈ ఐర‌న్ ని మ‌న శ‌రీరం త్వ‌ర‌గా గ్ర‌హించుకుంటుంది.

నాన్ వెజ్ తిన్నాక కాఫీని తాగితే మ‌న శ‌రీరం ఐర‌న్ ను గ్ర‌హించ‌దు. అలాగే నాన్ హీమ్ మొక్క‌ల నుంచి ల‌భిస్తుంది. అయితే వెజ్ తినే వారు ఈ ఐర‌న్ ని గ్ర‌హించ‌డం చాలా క‌ష్టం. దీనివ‌ల‌న మొక్క‌ల ఆధారిత బ‌ఠానీలు, గింజ‌లు, చిక్కుళ్లు లాంటివి తిన్నాక కాఫీ తాగితే జీర్ణ సంబంధిత వ్యాధులు ఎక్కువ‌గా వ‌స్తాయి. కాబట్టి కాఫీ తాగే ముందు ఈ ఆహార ప‌దార్ధాల‌ను తిన‌కుండా ఉండ‌డ‌మే మంచిది. అలాగే కొంత‌మంది పాలు త్రాగాక కాఫిని త్రాగుతారు. అంటే కాల్షియం తీసుకున్నాక కెఫిన్ ను తీసుకుంటారు. ఇలా తీసుకోవ‌డం వ‌ల‌న మ‌న శ‌రీరం కాల్షియంను గ్ర‌హించ‌లేదు. దీనితో కాల్షియం ఎక్కువ‌గా మీ బాడీలోకి కాకుండా మూత్రం ద్వారా బ‌య‌టికి వ‌స్తుంది. క‌నుక కాఫీని పాలు త్రాగాక తాగ‌కూడ‌దు. అలాగే కొంద‌రు కాఫీ తాగుతు ఆయిల్ ఫుడ్స్ ను తింటుంటారు. ఇలా తాగ‌డం వ‌ల‌న ఆయిల్ ఫుడ్ లో ఉండే కొల‌స్ట్రాల్, కాఫీలోని కెఫిన్ క‌లిసి పోయి చెడు కొల‌స్ట్రాల్ గా మారిపోతుంది.

దీనివ‌ల‌న మీ శ‌రీరంలో కొవ్వు పెరుగుతుంది. ఎక్కువ‌గా గుండె సంబంధిత వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అలాగే ఎక్కువ‌గా కాఫీ తాగితే మీ బాడీ జింక్ ను గ్ర‌హించే సామ‌ర్థ్యం కోల్పోతుంది. జింక్ ఎక్కువ‌గా బీన్స్,న‌ట్స్, రెడ్ మీట్ వంటి వాటిల్లో ఉంటుంది. క‌నుక ఈ ఆహార ప‌దార్ధాల‌ను తిన్నాక కాఫీని త్రాగ‌కూడ‌దు. అలాగే కాఫీని రోజుకి రెండు, మూడు సార్ల కంటే ఎక్కువ‌గా తాగ‌కూడ‌దు. దీనివ‌ల‌న నిద్ర‌లేమి, య‌సిడిటి మొద‌ల‌గు స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక కాఫీని ఎక్కువ‌గా తాగితే మీ ఆరోగ్యానికి హానిక‌రం.