షవర్మా(Shawarma) అనేది ఈ మధ్య ఎక్కువగా తింటున్నారు. బయట రోడ్ మీద బాగా ఎలెక్ట్రిక్ మంటతో కాల్చిన చికెన్ ని రోటిలో పెట్టి దాట్లో కొన్ని క్రీమ్స్ వేసి ఇస్తున్నారు. వీటిల్లో చికెన్ షవర్మాతో పాటు అందులోనే రకరకాలు అముతున్నారు. అయితే వీటిని తినడం వలన చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆరోగ్యానికి(Health) హానికరం అని షవర్మాని నిషేధించారు కూడా. షవర్మా తినడం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. షవర్మా తినడం వలన మనకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
* షవర్మా తినడం వలన మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది.
* షవర్మా తినడం వలన గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
* షవర్మా తినడం వలన ఆ చీకే ఎక్కువ రోజులు కాల్చి నిల్వ ఉంచిందైతే వాంతులు, విరేచనాలు వంటివి వస్తాయి.
* షవర్మా తినడం వలన కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.
* షవర్మా తినడం వలన డయేరియా వంటివి కూడా రావచ్చు.
* షవర్మా తినడం వలన మధుమేహం ఉన్నవారిలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.
* షవర్మా ను ప్యాకింగ్ చేసేటప్పుడు వాడే కవర్ల వలన కూడా మన ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది.
* షవర్మాను చేసే పదార్థాలు, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోయినా మన ఆరోగ్యం దెబ్బతింటుంది.
కాబట్టి బయట షవర్మా తినాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి.
Also Read : Rosacea: చలికాలంలో బుగ్గలు ఎర్రగా ఎందుకు మారుతాయో తెలుసా..?