Site icon HashtagU Telugu

Peanuts in winter: చలికాలం ఉదయాన్నే వేరుశనగలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Peanuts In Winter

Peanuts In Winter

చలికాలంలో ఎక్కువమంది ఇష్టపడే చిరుతిండ్లలో వేరుశనగ కూడా ఒకటి. వేరుశెనగలు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. తక్కువ ధరలో లభించి ఎక్కువ పోషకాలు అందించే వాటిలో వేరుశనగ కూడా ఒకటి అని చెప్పవచ్చు. వీటిని చిన్నపిల్లల నుంచి ముసలి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. పల్లీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్ హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి. అంతేకాదు శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది.

గర్భిణులు నిత్యం పల్లీలు తీసుకుంటే అవసరమైన పోషకాలు అందుతాయి. కాబట్టి పల్లీలను ఆహారంలో భాగం చేసుకోండి. వేరుశెనగలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, సూక్ష్మ, స్థూల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వేరుశెనగ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. విటిని హృద్రోగులు తరచుగా వేరుశెనగలను పుష్కలంగా తినవచ్చు. వేరుశెనగలోని నూనె తేలికగా జీర్ణమవుతుంది. వేరుశెనగలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి రోజుకు 6 నుంచి 7 వేరుశెనగలను తినడం వల్ల జీర్ణ సమస్యలు, పేగు సమస్యలు మలబద్ధకం వంటి సమస్యలు ధరిచేరవు.

ఈ పల్లీలు బీటా సైటోస్టెరాల్స్‌తో నిండి ఉంటాయి. ఇది కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించి శరీరంలో కేన్సర్ కణితుల పెరుగుదలను నిరోధిస్తుంది. మరి ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడంలో ఎంతో బాగా ఉపయోగ పడుతుంది. వేరుశెనగలో ఐసోఫ్లేవోన్స్, రెస్వెరాట్రాల్, ఫైటిక్ యాసిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.