Goat Milk: మేక పాలు వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే?

చాలామంది ప్రతి రోజు వారి దినచర్యను మొదట కాఫీ లేదా టీ లేదంటే పాలతో మొదలు పెడుతూ ఉంటారు. అయితే

  • Written By:
  • Publish Date - October 8, 2022 / 08:15 AM IST

చాలామంది ప్రతి రోజు వారి దినచర్యను మొదట కాఫీ లేదా టీ లేదంటే పాలతో మొదలు పెడుతూ ఉంటారు. అయితే ఇందుకోసం ఎక్కువగా చాలామంది గేదె పాలనే తాగుతూ ఉంటారు. ఇంకొంతమంది ఆవుపాలను తాగుతూ ఉంటారు. అయితే చాలామంది ఆవుపాల కంటే గేదె పాలనే ఎక్కువగా ఇష్టపడి తాగుతూ ఉంటారు. కొన్ని కొన్ని ప్రదేశాలలో మేకపాలు కూడా తాగుతూ ఉంటారు. అయితే మేక పాలు తాగడానికి చాలామంది ఇష్టపడరు. కానీ గేదె పాలు ఆవుపాలతో పాటుగా మేక పాలలో కూడా అనేక రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి నిపుణులు చెబుతున్నారు.

అయితే మేకపాలు అన్నవి ఆవుపాలు గేదె పాలు లాగా విరివిగా దొరకవు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. కాగా శరీరానికి పూర్తి పోషణ అందించే అత్యంత ప్రయోజకరమైన ఆహార పదార్థాలలో మేకపాలు కూడా ఒకటి. మేక పాల తాగడం వల్ల పిల్లలు ఎదుగుదల బాగుంటుంది అని చెబుతూ ఉంటారు. మరి మేక పాలలో ఇంకా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..మేక పాలలో ప్రోటీన్, లాక్టోస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గ్రోత్ హార్మోన్ ఉత్పత్తికి ముఖ్యమైనవి.

అయితే మేక పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదే విధంగా మేక పాలలో శరీరానికి కావలసిన విటమిన్ ఎ, డి, బి12, ఐరన్, జింక్, కాపర్, పాంతోతేనిక్ యాసిడ్ వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో అధిక ప్రోటీన్లు ఉన్న కారణంగా ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా మేక పాలను తాగవచ్చు. అలాగే మేక పాలు శరీరంలో యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా డెంగ్యూ నివారణలో కీలకంగా పనిచేస్తాయి. డెంగ్యూతో బాధపడేవారు పాలను తాగడం వల్ల తాగితే త్వరగా కోలుకుంటారు. ఈ పాలలో ఎటువంటి హార్మోన్లు, యాంటీబయాటిక్స్ ఉండవు కాబట్టి అందుకే మేకపాలు శరీర జీవక్రియల పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవు. మేక పాలలో లాక్టో ట్రాన్స్‌ ఫెర్రిన్ అనే సమ్మేళనం ఉంటుంది.