Drinking Water: కాగా మాములుగా కొందరికి నీళ్లు తాగిన వెంటనే మూత్రం వస్తుందని, లేదా వచ్చిన భావన కలుగుతూ ఉంటుంది. అయితే దీనిని లైట్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. రోజంతా అవసరానికి మించి నీళ్లు తాగితే శరీరం అదనపు ద్రవాన్ని బయటికి పంపించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మీరు రోజుకు 3 లీటర్లకు పైగా నీళ్లు తాగుతున్నట్లయితే తరచూ మూత్రం రావడం సాధారణమే. కానీ తక్కువ నీళ్లు తాగినా వెంటనే మూత్రం వస్తే అది శరీరంలో అసమతుల్యత సూచన కావచ్చు.
చాయ్, కాఫీ, కోల్డ్ డ్రింక్స్ వంటి వాటిలో ఉండే కాఫీన్ డయురిటిక్‌లా పనిచేస్తుందట. ఇది మూత్ర ఉత్పత్తి వేగాన్ని పెంచుతుందట. అందుకే తరచుగా టాయిలెట్‌కి వెళ్లాలనిపిస్తుందని చెబుతున్నారు. బ్లాడర్ మజిల్స్ ఎక్కువ సున్నితంగా మారినప్పుడు చిన్న మొత్తంలో మూత్రం ఏర్పడినప్పుడే టాయిలెట్‌కి వెళ్లాలనిపిస్తుందట. ఈ పరిస్థితిని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని పిలుస్తారు. ఇది సుదీర్ఘంగా కొనసాగితే తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలని చెబుతున్నారు. ఈ సమస్యను ప్రారంభంలో పట్టించుకోకపోతే మూత్ర నియంత్రణ సమస్యగా మారే ప్రమాదం ఉంటుందట.
తరచుగా మూత్రం రావడం డయాబెటిస్ యొక్క ముఖ్య లక్షణాల్లో ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు శరీరం అదనపు గ్లూకోజ్ ను మూత్రం ద్వారా బయటికి పంపుతుందట. దీని వల్ల మూత్ర పరిమాణం పెరుగుతుంది. అలాగే ఎక్కువ దాహం, అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకోవాలట. మహిళల్లో తరచూ కనిపించే సమస్య యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. ఇది బ్లాడర్ ఇన్ఫెక్షన్ వల్ల సంభవిస్తుందట. ఈ పరిస్థితిలో మూత్రం సమయంలో కాలినట్టుగా అనిపించడం, దుర్వాసన, నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.
ఇక కిడ్నీ స్టోన్ కూడా తరచూ మూత్రం రావడానికి కారణం కావచ్చట. మూత్రం రంగు ముదురు కావడం, కడుపు దిగువ భాగంలో నొప్పి, లేదా మూత్రం చేసిన తర్వాత కూడా ఉపశమనం లేకపోవడం ఇవన్నీ కిడ్నీ స్టోన్ సూచనలుగా పరిగణించాలని చెబుతున్నారు. అయితే అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు. వాటిలో నీరు ఒకసారిగా తాగడం కూడా ఒకటి. ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు తాగకుండా, రోజుకు 1.5 నుంచి 2 లీటర్ల నీటిని మాత్రమే తాగాలట. చాయ్, కాఫీ, ఆల్కహాల్, పులుపు పండ్లను పరిమితంగా తీసుకోవాలట. పెల్విక్ మజిల్స్ బలపడటానికి ఇవి ఉపయోగపడతాయట. మూత్ర నియంత్రణ మెరుగుపడుతుందట. మూత్రం వచ్చిన వెంటనే టాయిలెట్ కి వెళ్లకుండా కొంత సమయం ఆగండి, దీని వల్ల బ్లాడర్ సామర్థ్యం పెరుగుతుందట. అధిక బరువు, స్ట్రెస్ మూత్ర సమస్యను పెంచుతాయని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం అని చెబుతున్నారు.
