Site icon HashtagU Telugu

Health Issues in Women After Age 30: 30 దాటితే మహిళలకు వచ్చే సమస్యలు.. పూర్తిగా తెలుసుకోండి!

Womens

Womens

సాధారణంగా 30 ఏళ్లు దాటిన తర్వాత పురుషులతో పోల్చుకుంటే మహిళల్లో ఆరోగ్యం చాలా సున్నితంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక మరీ ముఖ్యంగా అయితే 30 ఏళ్లు దాటిన తర్వాత మహిళలను ఎన్నో రకాల సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అటువంటప్పుడు స్త్రీలు వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. 30 ఏళ్ళు దాటిన తర్వాత స్త్రీలు ఏడాదికి ఒకసారి అయినా సమగ్రంగా వైద్య పరీక్షలను నిర్వహించుకోవాలట. మరి స్త్రీలకు 30 దాటిన తర్వాత ఎటువంటి సమస్యలు వస్తుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు: పెళ్లి అయిన తర్వాత చాలామంది మహిళలు విపరీతంగా బరువు పెరిగిపోతూ ఉంటారు. మరి ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు మాదిరిగా పేరుకుపోతూ ఉంటుంది. ఈ బరువు, కొవ్వు కారణంగా మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బరువు పెరిగిపోయారంటే జీవక్రియలు ఇంతకుముందు మాదిరిగా సాఫీగా సాగవు.

జుట్టు రాలిపోవడం: 30 ఏళ్ళు దాటిన మహిళల్లో ఎక్కువగా హెయిర్ ఫాల్ సమస్య వేధిస్తూ ఉంటుంది. కాగా శరీరానికి కావాల్సిన పోషకాహారం తీసుకోవడం లేదన్న దానికి నిదర్శమనే జట్టు రాలిపోవడం. ఆహారం, పోషకాల పరంగా ఎటువంటి లోపం లేకపోతే, అప్పుడు హార్మోన్లలో అసమతుల్యత లేదంటే ఒత్తిళ్లు కారణమై జుట్టు ఊడిపోతూ ఉంటుంది.

గర్భధారణ: మరి ముఖ్యంగా ఎక్కువ మంది మహిళలను వేధిస్తున్న సమస్య గర్భధారణ. 30 ఏళ్ళు దాటిన తర్వాత మహిళలు గర్భధారణ అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. ఒకవేళ 30 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన కూడా ఎన్నో రకాల సమస్యలు తలెత్తవచ్చు. 35 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాలిస్తే రక్తపోటు, మధుమేహం సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

శ్వాసకోస సమస్యలు: 35 ఏళ్ల తర్వాత సహజంగా ఊపిరితిత్తుల సామర్థ్యం కొంత సన్నగిల్లుతుంది. ఇది కొంత మందిలో సమస్యలకు దారితీయవచ్చు. దీనికి శ్వాసకోసానికి బలాన్నిచ్చే వ్యాయామాలు తప్పనీ సరిగా చేయాలి.