Sitting: వామ్మో.. ఎక్కువసేపు కూర్చుంటే అంత డేంజరా?

సాధారణంగా సాఫ్ట్ వేర్ జాబ్ చేసే వాళ్ళు గంటలు తరబడి కూర్చుని ఉంటారు. అలాగే ఇంట్లో సీరియల్స్,మూవీస్ చూస్తూ

  • Written By:
  • Publish Date - April 13, 2023 / 06:00 AM IST

సాధారణంగా సాఫ్ట్ వేర్ జాబ్ చేసే వాళ్ళు గంటలు తరబడి కూర్చుని ఉంటారు. అలాగే ఇంట్లో సీరియల్స్,మూవీస్ చూస్తూ కాలక్షేపం చేసే చాలామంది టీవీల తరబడి మొబైల్ చూస్తూ గంటల తరబడి ఒకే చోట కూర్చుంటూ ఉంటారు.
కొంతమంది అలాగే మాట్లాడుతూ మాట్లాడుతూ గంటలు తరబడి ఒకే ప్రదేశంలో కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. అయితే అలా ఎక్కువ సేపు కూర్చొని ఉండటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చాలా సేపు సమయం కూర్చొని ఉండటం వల్ల శరీరంలో కదలికలు తగ్గి అది శరీరానికి విపరీతమైన పరిణామాలను తీసుకొస్తుంది.

కొంతమంది అటు ఇటు కూడా కదలకుండా ఎలా కూర్చున్న వాళ్ల్లు అలాగే స్ట్రక్ అయిపోతూ ఉంటారు. గంటల తరబడి కూర్చుని ఉండడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా కలకలం సృష్టిస్తున్నాయి. ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల గుండె, రక్తనాళ వ్యాధులు, గుండె పోటు, మెదడు స్ట్రోక్స్, సిర రక్తం గడ్డకట్టడం, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువ సమయం కూర్చుని పని చేసి ఎక్కువ సమయం నడవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.

అలాగే ఎక్కువ సమయం కూర్చుంటే ఇది బ్లడ్ గ్లూకోజ్ , బ్లడ్ ఫ్లాట్స్, బ్లడ్ ప్రెజర్ శరీర బరువు, పొత్తికడుపులోని కొవ్వును పెంచుతుంది. శరీరక శ్రమ కండరాల బలాన్ని పెంచుతుంది అదే రోజంతా కూర్చుని గడిపేవారిలో కండరాల నష్టాన్ని తీసుకువస్తుంది. అంటే కాల్షియంను తగ్గిస్తుంది. ఇది మలబద్దకాన్ని పెంచుతుంది. పెద్ద పేగు క్యాన్సర్ కు దారి తీస్తుంది. రక్తనాళాలు దెబ్బతింటాయి. నిదానమైన రక్త ప్రసరణ వల్ల రక్తం గడ్డకట్టే అవకాశాలు కూడా ఎక్కవగా ఉన్నాయి.
కాళ్లు, పెల్విస్ లోతైన సిరలలో రక్తం నిదానమైన ప్రవాహం వల్ల గడ్డకట్టడతుంది, ఇది స్థానభ్రంశం చెందుతుంది అలాగే ఊపిరితిత్తులకు వరకూ పోవచ్చు, దీని వలన పల్మనరీ ఎంబోలిజంలో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కువ సేపు అలాగే కూర్చోకుండా అరగంటకు ఒకసారి అలా పది నిమిషాల పాటు తిరిగి మళ్ళీ కూర్చోవడం చాలా మంచిది.