Site icon HashtagU Telugu

Lemon benefits: జలుబు దగ్గును నిమ్మకాయ నయం చేస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Lemon Benefits

Lemon Benefits

సిట్రస్ జాతి పండ్లలో ఒకటైన నిమ్మ పండు గురించి, నిమ్మ పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుంతుంది. అలాగే తిన్న ఆహారం అరగటానికి జీర్ణాశయంలోని ఆమ్లాలు తోడ్పడతాయి. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ వీటి స్థాయులు తగ్గుతూ వస్తుంటాయి. నిమ్మరసంలోని ఆమ్లాలు వీటికి చేదోడు వాదోడుగా నిలిచి ఆహారం జీర్ణం కావటానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి.

అయితే సాధారణంగా జలుబు దగ్గు చేసినప్పుడు నిమ్మకాయలను తీసుకోకూడదని, నిమ్మకాయలు తీసుకోవడం వల్ల కఫం పెరుగుతుందని చెబుతూ ఉంటారు. మరి ఈ విషయంపై వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిమ్మకాయలో విటమిన్ సి ఉండటం వల్ల జలుబు, రోగనిరోధక శక్తికి మంచిది. అలాగె నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్, యాంటీ వైరల్ ,యాంటీ బాక్టీరియల్ వంటి ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. నిమ్మకాయలో పొటాషియం, శరీరానికి అవసరమైన కొన్ని మినరల్స్ అధికంగా ఉండటం వల్ల కిడ్నీలకు ఎంతో చాలా మేలు చేస్తుంది. ఇది శరీర pH స్థాయిని నియంత్రించి సమతుల్యం చేస్తుంది. ఇది జలుబు,దగ్గుకు కూడా మంచిది.

నిమ్మరసంలో తేనె కలిపి తాగడం వల్ల దగ్గు, గొంతు బొంగురుపోవడం, గొంతు నొప్పి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కేవలం ఇవి మాత్రమే కాకుండా నిమ్మకాయ వల్ల ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మాములుగా జ్వరం, జలుబు డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. అటువంటప్పుడు నిమ్మకాయ నీరు శరీరంలో హైడ్రేషన్‌ను మెరుగుపరుస్తుంది. కేవలం తాగే నీరు ఒక సమయంలో బోరింగ్ అవుతుంది. లెమన్ వాటర్ రూపంలో నీటిని తీసుకుంటే నీరు తీసుకోవడం సులభం అవుతుంది. అంతేకాకుండా, నిమ్మరసం శరీరంలో సోడియం స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరానికి చాలా హాని కలిగించే కార్బోనేటేడ్ పానీయాల వినియోగాన్ని తగ్గించడంలో నిమ్మరసం ఎంతో బాగా ఉపయోగపడుతుంది.