Site icon HashtagU Telugu

Fenugreek Seeds: రోజుకు రెండు చెంచాలా మెంతులు.. ఎన్ని రోగాలను తరిమికొడుతుందో తెలుసా?

Fenugreek Seeds

Fenugreek Seeds

సాధారణంగా మెంతులను లేదా మెంతి ఆకు ను కూరల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మెంతులు రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో చాలా మేలు చేస్తాయి. ఈ మెంతి గింజల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక మెంతి గింజలను కేవలం తినడానికి మాత్రమే కాకుండా సౌందర్యానికి కూడా ఉపయోగిస్తుంటారు. ఈ మెంతులు చర్మం, జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తాయి. అందుకే చాలామంది ప్రతి రోజు మీరు మెంతి నీటిని తాగవచ్చు.

జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెంతులు మంచి ఔషధం అని చెప్పవచ్చు. అలాగే ఈ మెంతులు స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. అయితే సామాన్య వ్యక్తులు కాకుండా గర్భవతిగా ఉన్న మహిళలు ఈ మెంతులను తీసుకోవచ్చా? అలాగే మహిళలు మెంతులను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బాలింతలకు మెంతికూర పప్పు, మెంతులను తినిపించడం ద్వారా పాల ఉత్పత్తి పెరుగును.

అలాగే గర్భిణీ స్త్రీలు ప్రసవానికి ముందు ఈ మెంతులను, మెంతులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ప్రసవం సులభంగా అయిపోతుంది. ప్రతిరోజు 10 నుంచి 20 గ్రాముల మెంతులను నీళ్లు లేదంటే మజ్జిగలో కలిపి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తాగితే కొవ్వు కరుగుతుంది. అలాగే రోజు మెంతులు తినడం వల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. రెండు మూడు చెంచాల మెంతుల గింజలను నానబెట్టి తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అలాగే మెంతులు తేనె, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని తాగడం వల్ల జ్వరం తగ్గిపోతుంది. అలాగే మెంతులు గొంతు సమస్యలకు కూడా చక్కటి పరిష్కారంగా పనిచేస్తాయి.