Weight Loss In Winter: ఈ చలికాలంలో బరువు తగ్గాలంటే తినకూడదు.. తాగాల్సిందే..!

బరువు తగ్గడానికి (Weight Loss In Winter) ప్రజలు జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టిస్తారు. ఇవే కాకుండా అనేక రకాల డైట్‌లు పాటిస్తుంటారు.

  • Written By:
  • Updated On - December 2, 2023 / 08:53 PM IST

Weight Loss In Winter: బరువు తగ్గడానికి (Weight Loss In Winter) ప్రజలు జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టిస్తారు. ఇవే కాకుండా అనేక రకాల డైట్‌లు పాటిస్తుంటారు. అయితే ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. అయితే చలికాలంలో బరువు తగ్గడం కాస్త కష్టమవుతుంది. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి పెరుగుతున్న బరువు కారణంగా ఆందోళన చెందుతున్నారు. స్థూలకాయం వల్ల మధుమేహం, గుండె జబ్బులు వంటి అనేక ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇలాంటి పరిస్థితిలో ఈ సీజన్‌లో పెరుగుతున్న బరువును నియంత్రించడానికి మీరు మీ ఆహారంలో ప్రత్యేక మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి మీరు మీ ఆహారంలో కొన్ని ప్రత్యేక పానీయాలను చేర్చుకోవచ్చు. ఇంట్లో వాటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఆలస్యం చేయకుండా శీతాకాలంలో బరువు తగ్గడానికి మీకు ఏ పానీయాలు ప్రయోజనకరంగా ఉంటాయో ఇప్పుడే తెలుసుకోండి.

గ్రీన్ జ్యూస్

ఆకుకూరల్లోఐరన్ పుష్కలంగా ఉంటుంది. దోసకాయ, యాపిల్, నిమ్మకాయలను ఉపయోగించి డిటాక్స్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని చేయడానికి రెండు కప్పుల బచ్చలికూర, ఒక దోసకాయ, రెండు యాపిల్స్, ఒక ఒలిచిన నిమ్మకాయ, అల్లం కావాల్సి ఉంటుంది. ముందుగా అన్ని పదార్థాలను బాగా కడగాలి. ఆపై దోసకాయ, యాపిల్స్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. జ్యూసర్‌లో అన్ని పదార్థాలను ఉంచండి. వాటిని బాగా కలపండి. ఈ డ్రింక్ తాగడం వల్ల బరువు తగ్గుతారు.

బీట్ రూట్ రసం

పోషకాలు పుష్కలంగా ఉండే బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తరచుగా ప్రజలు బీట్‌రూట్‌ను సలాడ్‌లో ఉపయోగిస్తారు. మీరు బరువు తగ్గాలనుకుంటే బీట్‌రూట్ రసం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి బీట్‌రూట్, క్యారెట్, ఆపిల్, నిమ్మకాయలను తీసుకోండి. వాటిని కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ ఒక జ్యూసర్‌లో వేసి దాని నుండి జ్యూస్ సిద్ధం చేయండి. దీన్ని రోజూ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు.

Also Read: Green Coffee Benefits: గ్రీన్ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..?

పైనాపిల్ జ్యూస్

పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. దాని రసం చేయడానికి ఒక కప్పు పైనాపిల్ ముక్కలు, దోసకాయ, అల్లం ఒక జార్లో వేసి జ్యూస్ సిద్ధం చేయండి. దానికి నిమ్మరసం కలపండి. దీన్ని తాగడం వల్ల శరీరానికి తాజాదనంతోపాటు బరువు కూడా తగ్గుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

స్ట్రాబెర్రీ జ్యూస్

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది బరువు తగ్గించడంలో కూడా చాలా సహాయపడుతుంది. దాని రసం సిద్ధం చేయడానికి ఒక కప్పు స్ట్రాబెర్రీ, ఆపిల్, నిమ్మకాయ ముక్క తీసుకోండి. అన్ని పదార్థాలను బాగా కడగాలి. ఈ పండ్లన్నింటినీ ముక్కలుగా కోయండి. ఇప్పుడు వాటిని ఒక జారులో వేసి జ్యూస్ సిద్ధం చేయండి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ జ్యూస్ బరువు తగ్గడానికి, జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది.