Site icon HashtagU Telugu

Red Banana: ఎర్ర అరటి పండ్ల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Mixcollage 16 Feb 2024 04 28 Pm 9561

Mixcollage 16 Feb 2024 04 28 Pm 9561

మనకు మార్కెట్లో ఏడాది పొడవునా లభించే పండ్లలో అరటిపండు కూడా ఒకటి. అయితే మామూలుగా మనకు ఎక్కువ శాతం పసుపు పచ్చ రంగు ఉన్న అరటిపండ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఎక్కువ శాతం కొనుగోలు చేస్తూ ఉంటాం. అయితే కేవలం పసుపు రంగు అరటి పండ్ల వల్ల మాత్రమే కాకుండా ఎర్రటి ఎర్రటి పండ్ల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మనకు ఎర్రటి అరటి పండ్లు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అందుకే అరటి పండ్లు కనిపిస్తే అసలు వదలకూడదు అని అంటూ ఉంటారు వైద్యులు.

మరి ఎర్రటి పండ్ల వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. ఎర్ర అరటిపండులో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఈ పండు దక్షిణాఫ్రికాలో ఈ అరటి పండుకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఎర్రటి అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణ పండ్లలో పోషకాలు చాలా ఎక్కువ అయితే అరటి పండ్లు అందుకు మించి ఉంటాయి. ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ పదార్థాలు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అంతేకాదు సాధారణ అరటిపండు కంటే చాలా ఎక్కువ బిటా కేరోటిన్ కలిగి ఉంటుంది. ఎరుపు రంగు అరటిపండు తినడం వల్ల క్యాన్సర్ ఉండే సంబంధిత వ్యాధులు దరిచేరవు. ఎర్రటిపండ్లలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి.

బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారంగా చెప్పవచ్చు. అరటిపండు తినటం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఈ భావనతో అతిగా తినడం మానేస్తారు. ప్రతిరోజు ఒక ఎర్రటిపండు తినటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎరుపు రంగు అరటిపండ్లలో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది కాకుండా విటమిన్ బి6 కూడా ఈ పండు తినడం ద్వారా శరీరానికి లభిస్తుంది. ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా ఎర్రటిపండును చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.. మరియు క్యాన్సర్ దాడి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఇది మూత్రపిండాల రాళ్లు, గుండె జబ్బులు మరియు క్యాన్సర్ ఏర్పడకుండా చేస్తుంది. ఎముకలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.