Site icon HashtagU Telugu

Curd-Jaggery: పెరుగు, బెల్లం కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 01 Feb 2024 12 05 Pm 7180

Mixcollage 01 Feb 2024 12 05 Pm 7180

బెల్లం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లం ను ఎన్నో రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. బెల్లం తిన‌డం వ‌ల‌న అది మ‌న‌కు శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఈ బెల్లంలో ఇంకొర‌కం తాటి బెల్లం. ఇది ఇంకా మంచిది. తాటి బెల్లంని పాలలో కలుపుకుని తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. పాలలో చక్కెరకు బదులుగా తాటి బెల్లం లేదా మామూలు బెల్లం కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే బెల్లంను పాల‌తోనే కాదు పెరుగుతో క‌లుపుకొని కూడా తిన‌డం వ‌ల‌న కూడా చాలా మంచిది.

ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలా త‌ర‌చూ తినడం వల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతూ మనల్ని ఎల్ల‌పుడు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ బెల్లంను స్త్రీ లు ఎక్కువ‌గా తింటే చాలా మంచిది. ఎందుకు అంటే స్త్రీ ల‌కు ఋతుచక్రం స‌మ‌స్య‌లు ఉంటే ఈ బెల్లం తిన‌డం వ‌ల‌నఋతుచక్రం క్ర‌మం త‌ప్పితే వ‌రుప‌గా 3 లేదా 5 రోజుల‌ పాటు తింటూ వ‌స్తే ఋతుచక్రం స‌క్ర‌మంగా క్ర‌మం త‌ప్ప‌కుండా వ‌స్తుంది. స‌క్ర‌మంగా క్ర‌మం త‌ప్ప‌కుండా వ‌చ్చేవారైనా స‌రే దీనిని తిన‌వ‌చ్చు. అలా తిన‌డం వ‌ల‌న ఐర‌న్ బాగా పెరుగుతుంది. ఫ‌లితంగా ర‌క్తం వృద్ధిచేంది రక్త‌హిన‌త‌ను త‌గ్గిస్తుంది. స్త్రీ ల‌లో ఋతుచక్రం స‌మ‌యంలో ఋతుస్రావం ఎక్కువ‌గా అయిన‌ప్పుడు ర‌క్తం త‌గ్గిపోతుంది.

త‌త్ఫ‌లితంగా ఐర‌న్ శాతం కూడా బాగా త‌గ్గిపోతుంది. అప్పుడు ఈ బెల్లంను తిన‌డం వ‌ల‌న ఐర‌న్ పెరిగి ర‌క్తం వృద్ధి చెందుతుంది. స్త్రీలు పెరుగు తో, పాల‌తో కానీ తిన‌వ‌చ్చు. కాళ్ళ తిమిర్లు చేతి తిమిర్లు ఉంటే పెరుగు, బెల్లంతో చేసిన‌ స్వీట్స్ తినవచ్చు. లేదంటే బెల్లం పెరుగు నీరుగా అయినా తినవచ్చు. మ‌గ‌వారు కూడా బెల్లంను తిన‌వ‌చ్చు . వీరిలో కూడా ఎర్ర రక్త క‌ణాల‌ను ఉత్ప‌త్తి చేయ‌డానికి, అధిక బ‌రువు త‌గ్గించుకొవ‌డానికి , వ్యాధినిరోద‌క శ‌క్తిని పెంచ‌డానికి స‌హ‌య‌ప‌డుతుంది. తాటి బెల్లంను చిన్న పిల్ల‌ల‌కు పాల‌లో కొంచం క‌లిపి ప్ర‌తి రోజూ తాగించ‌డం వ‌ల‌న వారికి ఇమ్యూనిటి శాతం పెరుగుతుంది. ద‌గ్గు , జ‌లుబు , జ్వ‌రం లాంటి ఏ ఇత‌ర వ్యాదులైన వారికి రాకుండా వ్యాధినిరోద‌క శ‌క్తిని పెంచుతుంది.

చిన్న పిల్ల‌లు అయినా పెద్ద‌వాలైన స‌రే బెల్లంను పెరుగుతో క‌లుపుకొని తిన‌డంవ‌ల‌న శారీరక బలహీనతను తగ్గిస్తుంది. ఈ బెల్లంలో మెగ్నీషియం, ఇనుము, ఖ‌నిజాలు, సెలీనియం, మాంగ‌నీస్, రాగి, కాల్షియం వంటి అనేక పోష‌కాలు క‌లిగి ఉంటుంది. మ‌న‌కు జ‌లుబు, ప్లూ స‌మ‌స్య‌లు లాంటివి వ‌చ్చిన‌ప్పుడు బెల్లంను పెరుగుతో న‌ల్ల మిరియాలు క‌లిపి తినాలి. ఇలా తిన‌డం వ‌ల‌న అంటు వ్యాది ప్ర‌బ‌ల‌కుండా మ‌న శ‌రిరాన్ని కాపాడుతుంది. ఈ బెల్లం పెరుగుతో క‌లుపుకొని తిన‌డం వ‌ల‌న మ‌న‌కు క‌డుపుకు సంబ‌ధిత వ్యాదులు నుంచి కాపాడుతుంది. రోజూ ఒక క‌ప్పు బెల్లంను తీసుకోవడం వల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది క‌డుపు స‌మ‌స్య‌లు త‌గ్గించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది . బెల్లం ను తిన‌డం వ‌ల‌న మ‌న శ‌రిరంలో అధిక వేడి ఉత్ప‌త్తి అవుతుంది.