AlBukhara Fruit : ఆల్‌బుకర పండ్లు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

వర్షాకాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో ఆల్‌బుకర(AlBukhara) పండ్లు ఒకటి. వీటిని ప్లమ్ యాపిల్(Plum Apple) అని కూడా అంటారు. ఆల్‌బుకర పండును తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Published By: HashtagU Telugu Desk
Health Benifits of AlBukhara Fruit Plum Apple

Health Benifits of AlBukhara Fruit Plum Apple

వర్షాకాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో ఆల్‌బుకర(AlBukhara) పండ్లు ఒకటి. వీటిని ప్లమ్ యాపిల్(Plum Apple) అని కూడా అంటారు. ఆల్‌బుకర పండును తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆల్‌బుకర పండులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.

* ఆల్‌బుకర పండులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
* ఆల్‌బుకర పండులో ఉండే విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచి ఇన్ఫెక్షన్లు తొందరగా రాకుండా చేస్తాయి.
* ఆల్‌బుకర పండ్లను తినడం వలన మనకు శ్వాస, రొమ్ము సంబంధ క్యాన్సర్లు రావడాన్ని తగ్గిస్తాయి.
* ఆల్‌బుకర పండ్లలో ఉండే విటమిన్ ఎ నోటికి సంబంధించిన క్యాన్సర్లు రావడాన్ని తగ్గిస్తాయి.
* ఆల్‌బుకర పండ్లను తినడం వలన మన శరీరంలో ఎర్ర రక్తకణాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఇవి మన శరీరంలో రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి.
* ఆల్‌బుకర పండ్లలో ఉండే సిట్రిక్ ఆసిడ్ మన శరీరంలోని అలసటను తగ్గివుతాయి.
* ఈ ఆల్‌బుకర పండ్లను తినడం వలన ఎముకలు బలంగా తయారవుతాయి.
* ఈ పండును తినడం వలన మన శరీరంలోని మలినాలను చెడు కొవ్వును బయటకు పంపించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
* ఈ పండులో ఫోలిక్ ఆసిడ్, కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి ఇవి మన చర్మాన్ని గట్టిగా తయారుచేస్తుంది.

కాబట్టి ఈ వర్షాకాలం దొరికే ఆల్‌బుకర పండ్లు తిని మీ ఆరోగ్యాన్ని మరింత పెంపొందించుకోండి.

 

Also Read : Skin Care Tips: అందమైన, మెరిసే చర్మం కావాలా..? అయితే మీరు చేయాల్సింది ఇదే..!

  Last Updated: 18 Aug 2023, 08:55 PM IST