Site icon HashtagU Telugu

Health Benifits: ఆయుష్షుని పెంచే వాము మొక్క.. ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో?

Mixcollage 08 Dec 2023 01 58 Pm 5545

Mixcollage 08 Dec 2023 01 58 Pm 5545

మామూలుగా మనం ఇంట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. కొంతమంది సాధారణ మొక్కలతో పాటు వాము వంటి ఔషధ మొక్కలను కూడా పెంచుకుంటూ ఉంటారు. ఈ వాము ఆకులను చాలా మంది కప్పరిల్లాకు, దగ్గు ఆకు అంటూ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ వాము ఆకు వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ వాము ఆకులను ఉపయోగించి రకరకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ వాము ఆకులు కడుపునొప్పిని తగ్గించడానికి అలాగే దగ్గు జలుబు చేసినప్పుడు ఎంతో బాగా ఉపయోగపడతాయి.

మరి ఈ ఆకు వల్ల ఇంకా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ మొక్కకు నీరు ఎక్కువ అవసరం ఉండదు. మొక్కలోని ఒక కాడను తెంపి భూమిలో పెడితే అది పెద్ద మొక్కగా విస్తరిస్తుంది. ఇది సువాసనలు ఎదజల్లే గొప్ప మొక్క. ఇది ఇంటి గుమ్మం దగ్గర లేదా ఇంట్లోకి గాలి వచ్చే చోట పెడితే ఈ మొక్క నుంచి వచ్చే గాలి పరిమళాలతో వస్తుంది. దానిని పీల్చడం వలన ఆరోగ్యానికి ఎంతో ఫలితం ఉంటుంది. ఈ వాము ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గర్భిణీలకు, పాలిచ్చే బాలింతలకు మాత్రం వీటిని వాడకూడదు. ముఖ్యంగా గర్భిణీలు వీటిని వాడితే గర్భస్రావం అవుతుంది. లేదా పుట్టే బిడ్డకు నష్టం కలుగుతుంది. ఈ ఆకులలో ఉండే ఔషధ గుణాలు రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది.

గుండెలోని రక్తనాళాల్లోకి కాల్షియం వెళ్లకుండా చేయడం వలన బిపిని కంట్రోల్ చేస్తాయి. కరివేపాకు, కొత్తిమీరను ఉపయోగించినట్లు వాము ఆకులను కూడా కూరల్లో వాడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అజీర్తి, ఉబ్బరం, పొట్ట గ్యాస్ లాంటి సమస్యలు తొలగిపోతాయి. మలబద్ధకం కూడా తగ్గుతుంది. అలాగే ప్రేగుల్లో నొప్పి అల్సర్లు లాంటివి తగ్గుతాయి. వామాకులలో క్యాలరీలు తక్కువ ప్రోటీన్ ఫ్యాట్ కార్బోహైడ్రేటు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని ఫలితంగా శరీరంలోని కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. ఈ ఆకులు బరువు పెరగకుండా చేస్తే దానివల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఎక్కువ కాలం జీవించడానికి ఈ ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ వాము ఆకులు మంచి సువాసన వస్తుంటాయి. వాటితో చట్నీలు, జ్యూస్, బజ్జీలు, పకోడీలు కూరలులో కూడా వాడుకోవచ్చు. ఈ ఆకుల వల్ల ఆయుష్ పెరుగుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వాము ఆకుల్ని నిత్యం వాడే వారికి దగ్గు, జలుబులు అస్సలు రావు. ఒకవేళ వస్తే పది వాము ఆకుల్ని కడిగి వేడి నీటిలో వేసి మరిగించుకోవాలి. ఈ నీరు బాగా మరిగిన తర్వాత వడకట్టి తీసుకోవాలి. కావాలంటే ఒక స్పూన్ తేనె కూడా కలుపుకొని తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అంతా దగ్గు, జలుబు వంటి సమస్యలతో పాటు అజీర్తి లాంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.