Drinking Water: పరగడుపున నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలు తెలుసా?

సాధారణంగా వైద్యులు ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలని చెబుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఎండాకాలంలో ఎండకు పనిచేసే వారు ఇంకా ఎక్కువ

Published By: HashtagU Telugu Desk
Drinking Water

Drinking Water

సాధారణంగా వైద్యులు ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలని చెబుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఎండాకాలంలో ఎండకు పనిచేసే వారు ఇంకా ఎక్కువ నీటిని తాగమని చెబుతూ ఉంటారు. తగినన్ని నీరు తాగడం వల్ల హెల్దిగా ఉండవచ్చు. కానీ చాలామంది బిజీ బిజీ సజ్జలు వల్ల సరిగా నీరు తాగక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలి అంటే కచ్చితంగా నీటిని తాగాల్సిందే. చాలామంది పరగడుపున నీరు తాగుతూ ఉంటారు.. మరికొంతమంది తాగడానికి అంతగా ఆసక్తిని చూపించరు.

అయితే పరగడుపున నీరు తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం.. ఉదయం లేవగానే రెండు గ్లాసుల నీటిని తీసుకోవడం వల్ల తిరిగి మన శరీరం రీహైడ్రేషన్ స్థితికి వస్తుంది. దీనివలన రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండవచ్చు. పరిగడుపున నీళ్ళు తాగడం వలన జీవక్రియ రేటు పెరుగుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు పరగడుపున ఒకటి లేదా రెండు గ్లాసుల నీటిని తాగడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.

అలా నీరు తాగడం వల్ల మలబద్ధకం సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. పరిగడుపున నీళ్ళు తాగడం వలన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖంపై ఉండే పింపుల్స్ కూడా తగ్గిపోయి ముఖం మంచి గ్లో కూడా వస్తుంది. ఎర్ర రక్తకణాలు యాక్టివ్‌ అవుతాయి. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులు పెరిగి రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతాయి. శరీరానికి కావాల్సినంత నీళ్లు తీసుకోకపోతే శరీరం డీ హైడ్రేషన్ కు దారితీస్తుంది. దీంతో అనేకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి.

  Last Updated: 10 May 2023, 05:56 PM IST