Site icon HashtagU Telugu

Brinjal: వామ్మో వంకాయ వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?

Mixcollage 18 Mar 2024 04 30 Pm 223

Mixcollage 18 Mar 2024 04 30 Pm 223

వంటింట్లో దొరికే కూరగాయలలో వంకాయ కూడా ఒకటి. వంకాయతో ఎన్నో రకాల కూరలు తయారు చేసుకొని తింటూ ఉంటారు. అయితే కొందరు వంకాయ తినడానికి ఎంత ఇష్టపడరు. మరి కొందరు మాత్రం ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే మీరు కూడా వంకాయను అవాయిడ్ చేస్తున్నారా. వంకాయ వల్ల కలిగే ప్రయోజనాలు చేస్తే మాత్రం వంకాయని తినకుండా అసలు ఉండలేరు మరి వంకాయ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కూరగాయల రారాజు వంకాయ. వంకాయ చాలా సాధారణమైన కూరగాయ అయినప్పటికీ దీనిని అందరూ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

వంకాయలను ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచమంతా తింటారు. భారతదేశంలోనే కాకుండా చైనా, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ వాళ్ళు వంకాయలను బాగా ఇష్టంగా తింటారు వంకాయలలో కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇది విటమిన్ ఏ లోపాన్ని నివారిస్తుంది. అందుకే వంకాయలను తింటే విటమిన్ ఏ మనకు పుష్కలంగా లభిస్తుంది. కంటి చూపును మెరుగు పరచడానికి విటమిన్ ఏ చాలా ముఖ్యమైనది. ఆహారంలో వంకాయలను భాగంగా చేసుకుంటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వంకాయలు తక్కువ కేలరీల ఆహారం. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో వంకాయ కీలక పాత్ర పోషిస్తుంది.

అయితే వంకాయలను వండేటప్పుడు ఎక్కువ నూనె పోసి వండకూడదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. లేకపోతే వంకాయల వల్ల వచ్చే గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలు రాకుండా పోతాయి. వంకాయలను ఆహారంలో భాగంగా చేసుకోని వారు దృష్టి సమస్యలకు లోను కావలసి వస్తుంది. వంకాయలలో ఫైబర్ యొక్క గొప్ప గుణాలు ఉన్నాయి. వంకాయలలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. వంకాయలు టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి డయాబెటిస్ ను నివారించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. వంకాయలను క్రమం తప్పకుండా తింటే ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే వంకాయలు మన శరీరంలో ఉన్న విష వ్యర్ధాలను బయటకు పంపిస్తాయి. మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇంత ఆశ్చర్యకరమైన, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వంకాయలను కచ్చితంగా ప్రతి ఒక్కరు ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.