చలికాలం వచ్చింది అంటే చాలు చాలా రకాలు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇందుకు గల కారణం రోగనిరోధక శక్తి తగ్గిపోవడం. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు వాటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే చలికాలంలో వచ్చే ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. చలికాలంలో తీసుకోవాల్సిన వాటిలో బొప్పాయి కూడా ఒకటి. బొప్పాయి తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఇది తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుందట.
అలాగే ఈ బొప్పాయి తినడం వల్ల నీరసం తగ్గిపోతుందట. జీర్ణక్రియ కూడా మెరుగ్గా పని చేస్తుందని చెబుతున్నారు. బొప్పాయి పండులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీని వల్ల చలికాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. అలాగే ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా మీ దరికి చేరవు. అదేవిధంగా బొప్పాయి పండు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పని చేస్తుందట. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా దూరమవుతాయని చెబుతున్నారు. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తిన్న ఆహరం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడతాయట. అలాగే మలబద్దకాన్ని నివారిస్తాయని చెబుతున్నారు. ఈ పండులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది.
అలాగే చాలా తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయి. దీని కారణంగా దీనిని తినడం వల్ల త్వరగా జీర్ణం కావడంతో పాటు, తిన్న ఆహరం కూడా తక్షణమే జీర్ణమై శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. తద్వారా ఎక్కువ ఆహరం తినకుండా ఉండవచ్చు. ఫలితంగా బరువు కూడా నియంత్రణలో ఉంటుందట. చర్మం తేమగా ఉండడం సాధారణంగా చలికాలంలో నీరు తక్కువగా తాగుతుంటారు. దీని కారణంగా చర్మం వెంటనే పొడిబారుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో బొప్పాయి పండు తినడం వల్ల చర్మం తేమగా ఉంటుందట.
ఇందులో విటమిన్ ఏ, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే బొప్పాయి తినడం వల్ల చర్మం తేమగా, ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. బొప్పాయిలో యాంటీ యాక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే గుండె జబ్బులు తగ్గిపోతాయి. షుగర్ ఉన్న వారికి అమృతం షుగర్ పేషంట్స్‌కు అమృతం బొప్పాయిలో చాలా తక్కువ స్థాయిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీనిని తినడం వల్ల రక్తంలో ఇన్సులిన్ పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో షుగర్ కూడా నియంత్రలో ఉంటుందని, అందుకే చలికాలంలో తప్పనిసరిగా బొప్పాయి పండును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.