Honey : తేనె.. ప్రతిరోజూ చాలా మంది దీనిని వివిధ రకాలుగా తీసుకుంటుంటారు. సహజంగానే తియ్యగా ఉండటంతో.. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కొందరు షుగర్ కు బదులుగా తేనెనే పాలలో కలిపి తాగుతారు. మరికొందరు సలాడ్స్ వంటివాటిలో వేసి తింటారు. ఉదయాన్నే పరగడుపున వేడినీళ్లలో తేనె వేసుకుని తాగితే చాలా మంచిదని చాలా సందర్భాల్లో ఆరోగ్య నిపుణులు చెప్పారు. తేనెతో కొన్ని అనారోగ్యాలను ఈజీగా తగ్గించుకోవచ్చట. అవేంటో తెలుసుకుందాం.
రాత్రి పడుకునే ముందే.. పావు టీ స్పూన్ జాజికాయ పొడిలో.. 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే కలత లేని నిద్ర పడుతుంది. దీనిద్వారా నిద్రలేమి సమస్య తగ్గుతుంది.
1 కప్పు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే.. గొంతు సంబంధిత సమస్యలు తగ్గడంతో పాటు.. పొడిదగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
అధిక బరువు తగ్గాలనుకునేవారు.. 1 కప్పు గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ దాల్చినచెక్క పొడి, 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి ఉదయం, సాయంత్రం తాగితే ఫలితం ఉంటుంది.
టీ డికాషన్ లో 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి ఉదయాన్నే తీసుకుంటే.. శరీరంలో ఉండే మలినాలు బయటకు వెళ్లిపోతాయి.
దాల్చిన చెక్క పొడిని 1 టేబుల్ స్పూన్ తేనెతో కలిపి నొప్పి ఉన్న దంతంపై రాస్తూ ఉంటే.. వాటి నొప్పి తగ్గుతుంది.
1 కప్పు గోరువెచ్చని నీటిలో 1 టీ స్పూన్ అల్లం రసం, 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగితే సైనస్ సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
1 టీ స్పూన్ అల్లరసం, 1 టేబుల్ స్పూన్ తేనెను కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే సైనస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే 1 స్పూన్ తేనెను గోరువెచ్చని పాలలో కలిపి ఉదయం, సాయంత్రం తాగితే జలుబు తగ్గుతుంది.
కొద్దిగా టీ ట్రీ ఆయిల్ ను తీసుకుని.. 1 టీస్పూన్ తేనెతో కలిపి మొటిమలపై రాస్తే.. అవి త్వరగా తగ్గుతాయి.