Site icon HashtagU Telugu

Cloves: లవంగం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Mixcollage 03 Jul 2024 07 33 Am 5391

Mixcollage 03 Jul 2024 07 33 Am 5391

మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో లవంగం కూడా ఒకటి. లవంగం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. లవంగం కూరల రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. లవంగం తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి లవంగం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చలికాలంలో వచ్చే అనేక రోగాల బారి నుండి లవంగాలు మనలను కాపాడతాయి.

చాలామంది జలుబుతో బాధపడుతూ ఉంటారు. అటువంటివారు లవంగాల టీ తాగితే ఉపశమనం లభిస్తుంది. లవంగాలలో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు మన దగ్గరకు రాకుండా పోరాటం చేస్తాయి. ఇక శీతాకాలంలో చాలా మంది విపరీతమైన దగ్గుతో బాధపడుతూ ఉంటారు. పొడిదగ్గు, కఫంతో బాధపడే వారికి లవంగం చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల పొడిదగ్గు నయమవుతుంది. కఫం సమస్య బాగా తగ్గుతుంది. అలాగే రోజు లవంగం టీ తాగితే జీర్ణక్రియ సమస్యలు దరిచేరవు. భోజనం చేసిన గంట తర్వాత లవంగం టీ తీసుకోవడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

లవంగాలు శరీరంలోని టాక్సిన్లను తొలగించి చర్మం మృదువుగా ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. చాలామంది పంటి నొప్పితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు లవంగం టీ తాగడం వల్ల లేదా లవంగాలను నమలడం వల్ల పంటినొప్పి తగ్గడంతో పాటు నోటి దుర్వాసన సమస్య దూరం అవుతుంది. కాగా లవంగాలలో యుజైనాల్ అనే తైలం ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు తరచుగా లవంగాలను వాడడం వల్ల వారికి ఉపశమనం కలుగుతుంది. లవంగాలలో ఉండే యుజైనాల్ తైలం యాంటీ సెప్టిక్ లా పనిచేసి పళ్ళ చిగుళ్ళను కాపాడుతుంది. పంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. లవంగాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేస్తాయి. కాగా డయాబెటిస్ తో బాధపడే వారికి లవంగాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. లవంగాలలో ఉండే విటమిన్ సి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తరచుగా లవంగాలను వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.