Site icon HashtagU Telugu

Bay leaf: బిర్యానీ ఆకులు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Bay Leaf

Bay Leaf

బిర్యానీ ఆకు.. ఈ పేరు వినగానే మనకు ముందుగా బిర్యానీ గుర్తుకు వస్తూ ఉంటుంది. అయితే చాలామంది బిర్యాని ఆకు కేవలం బిర్యానీకి రుచి తెప్పించడం కోసం మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ బిర్యానీ ఆకు బిర్యానీకి రుచి పెంచడంతోపాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. మరి బిర్యానీ ఆకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిర్యానీ ఆకులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి విటమిన్ ఎ, బి6, విటమిన్ సికి మంచి మూలం. ఈ విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

బిర్యానీ ఆకు మన జీర్ణవ్యవస్థను కూడా బలపరుస్తుంది. ఇది కడుపు నొప్పిని కూడా నయం చేస్తుంది. అంతే కాదు కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బిర్యానీ ఆకులు ముక్కు కారటం సమస్యను చాలా త్వరగా నయం చేస్తుంది. మరోవైపు, ఎండుమిర్చిని బిర్యానీ ఆకులతో కలిపి తీసుకుంటే సైనస్ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి, బి 6, ఐరన్, పొటాషియం వంటి గొప్ప వనరులెన్నింటినో కలిగి ఉంది. జీర్ణశయ వ్యవస్థపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ మసాలా దినుసులలో లభించే సమ్మేళనాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

బే ఆకు ఒత్తిడి హార్మోన్లను నియంత్రించి, ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుంది. శరీరాన్ని మంట నుండి రక్షిస్తాయి. జీర్ణక్రియను వేగవంతం చేయడానికి దాల్చిన చెక్కతో కలిపి టీ తయారు చేసుకుని తాగాలి. ఇది బరువు తగ్గడానికి మరింత సహాయపడుతుంది. దాల్చిన చెక్క కడుపులోని కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.