Site icon HashtagU Telugu

Cough-Cold: కేవలం రెండే రెండు నిమిషాల్లో దగ్గు జలుబు మాయం.. అందుకోసం ఏం చేయాలంటే!

Cough Cold

Cough Cold

కొందరికి సీజన్ తో సంబంధం లేకుండా దగ్గు, జలుబు సమస్యలు వేధిస్తూ ఉంటాయి. కొందరికి వారాల తరబడి ఈ సమస్య ఇబ్బంది పెడితే మరికొందరికి నెలలు గడిచినా కూడా దగ్గు జలుబు అలాగే ఉంటుంది. అయితే దగ్గు, జలుబు తగ్గించుకోవడం కోసం చాలా రకాల వంటింటి చిట్కాలను ఉపయోగించడం తో పాటు మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ దగ్గు జలుబు త్వరగా తగ్గదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఎలాంటి చిట్కాలు పాటిస్తే తొందరగా జలుబు దగ్గు తగ్గుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో చాలా మంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి, వైరల్ ఫీవర్‌ తో బాధ పడుతుంటారు. అలాగే రోగనిరోధక శక్తి కూడా తగ్గుతూ ఉంటుంది.

అయితే శీతాకాలంలో వచ్చే ఈ సమస్యలను తగ్గించేందుకు, వాటి నుంచి ఉపశమనం పొందేందుకు వాము ఎంతగానో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి వాముతో ఏం చేస్తే దగ్గు జలుబు తగ్గుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వామును సాధారణంగా ఆహారాన్ని సిద్ధం చేసే క్రమంలో వినియోగిస్తుంటాము. ఇవి జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. కానీ జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలను కూడా పరిష్కరిస్తుందని చాలా మందికి తెలియదు. వాములో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గొంతులో వాపును తగ్గిస్తుంది. అలాగే గొంతులో గరగరకు కారణమయ్యే వాటిని కూడా పరిష్కరిస్తుందట. దాంతో దగ్గు ఈజీగా తగ్గిపోతుందని చెబుతున్నారు. వాము అనేది ఒక ఎక్స్‌పెక్టోరెంట్. ఇది చాతిలోనే కఫాన్ని తొలగించడానికి చాలా సహాయపడుతుందట.

అలాగే వాము తీసుకోవడం వల్ల దగ్గుతో పాటు కఫం కూడా తగ్గిపోతుందట. బ్యాక్టీరియాల నాశనం కోసం వాములో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో జలుబుకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతుంది. దీని ద్వారా జలుబు తగ్గిస్తుంది. అలాగే వాములో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. వాము తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి జలుబుకు కారణమయ్యే బ్యాక్టీరియాపై పోరాడేందుకు కావాల్సిన శక్తి లభిస్తుంది. దగ్గు జలుబు సమస్యలు ఉన్నవారు వాము నీరు తాగడం, వంటల్లో వేసుకోవడం, పొడిగా చేసి తినడం, నెయ్యితో కలిపి కూడా తీసుకోవచ్చు. వివిధ మార్గాల్లో వామును తీసుకోవడం వల్ల ప్రయోజనాలు సమానంగా ఉంటాయి. ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ వాము వేసుకొని, ఆ నీటిని మరిగించి తాగడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, తేన్పులు వంటి సమస్యలు దూరమవుతాయట. అలాగే వామును వంటల్లో వేసుకోవడం వల్ల ఆ వంటలకు ప్రత్యేకమైన రుచి వస్తుందట. దీంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు జరుగుతుందని చెబుతున్నారు. వామును పొడిగా చేసి, నల్ల ఉప్పుతో కలిపి తీసుకోవడం వల్ల కడుపునొప్పి తగ్గిపోతుందట. అలాగే వాము పొడిని నెయ్యితో కలిపి తీసుకోవడం నెలసరి సమయంలో వచ్చే సమస్యలన్నీ దూరమవుతాయని చెబుతున్నారు.