Green Tea: గ్రీన్ టీ ఏ సమయంలో తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో చాలామందికి ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఒక కప్పు టీ లేదంటే కాపీ తాగిన తర్వాతనే వారి పనులను మొదలు పె

  • Written By:
  • Publish Date - May 29, 2023 / 07:15 PM IST

ప్రస్తుత రోజుల్లో చాలామందికి ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఒక కప్పు టీ లేదంటే కాపీ తాగిన తర్వాతనే వారి పనులను మొదలు పెడుతూ ఉంటారు. ఒక్కరోజు కాఫీ, టీ తాగకపోయినా కూడా ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే టీ లేదా కాఫీ ని తాగడం వల్ల రిఫ్రెష్ గా అనిపించడంతో పాటు కాస్త ఎనర్జీ కూడా వస్తుంది. అందుకే ఆఫీసులలో ఉద్యోగాలు చేసేవారు రెండు మూడు గంటలకు ఒకసారి కాఫీ లేదా టీ ను తాగుతూ ఉంటారు.

ఉదయం లేవగానే కాఫీ, టీ, గ్రీన్ టీ, పాలు, బూస్ట్ ఇలా ఒక్కొక్కరు వారికి ఇష్టమైనవి తాగుతూ ఉంటారు. చాలామందికి ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం అలవాటు. గ్రీన్ టీ తాగడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. చాలామంది గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకున్న తర్వాత ఎక్కువ శాతం మంది గ్రీన్ టీ తాగడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. సాధారణ టీతో పోలిస్తే గ్రీన్ టీ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇందులో అద్భుతమైన పోషక గుణాలు ఉన్నాయి.

ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. గ్రీన్ టీని రోజువారీ డైట్‌లో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. గ్రీన్ టీతో కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. కానీ గ్రీన్ టీ తాగేందుకు సరైన సమయం ఏంటి అనేది మనలో చాలామందికి తెలియదు. మరి గ్రీన్ టీ తాగడానికి ఏ సమయం సరైనదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రోజులో ఎప్పుడు పడితే అప్పుడు గ్రీన్ టీ సేవించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే అందులో ఉండే కెఫీన్ ఆరోగ్యం పై విచిత్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే గ్రీన్ టీని సరైన సమయంలో తాగాల్సి ఉంటుంది. తద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. గ్రీన్ టీని బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్‌కు గంట ముందు లేదా సాయంత్రం స్నాక్స్‌తో తీసుకోవడం ఉత్తమం. చాలామంది గ్రీన్ టీ వల్ల లాభాలు ఎక్కువ ఉన్నాయని తెగ తాగేస్తూ ఉంటారు. అలా అని గ్రీన్ టీ ఎక్కువ తాగడం వల్ల కడుపులో మంట, కడుపు సమస్య లేదా గ్యాస్, జీర్ణ సంబంధ సమస్యలు, తలనొప్పి, ఆందోళన, నిద్రలేమి, ఎనీమియా, బ్లీడింగ్ డిసార్డర్, లివర్ సమస్య, ఎముకలపై దుష్ప్రభావం లాంటి సమస్యలు తలెత్తుతాయి.