Site icon HashtagU Telugu

Health Benefits: మట్టి కుండలో నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Mixcollage 05 Jan 2024 03 07 Pm 677

Mixcollage 05 Jan 2024 03 07 Pm 677

టెక్నాలజీ మారిపోవడంతో మనుషుల జీవనశైలి ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. ఇదివరకటి రోజుల్లో నీరు తాగడానికి మన పెద్దవారు ఎక్కువగా మట్టికుండలనే ఉపయోగించేవారు. కానీ రాను రాను కాలక్రమేనా మట్టికుండల వాడకం విపరీతంగా తగ్గిపోయింది. ఇక ప్రస్తుత రోజుల్లో అయితే ఒక్క ఎండాకాలంలో తప్పితే మిగతా కాలంలో ఈ కుండలను అస్సలు వాడరు. కుండలో నీరు తాగడానికి ఇబ్బందిగా గిల్టీగా ఫీల్ అయ్యే వారు కూడా చాలామంది ఉన్నారు.

కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కుండలోని నీరు తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా వాస్తు ప్రకారం గా కూడా మట్టి కుండ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్ర‌కారం మ‌ట్టి కుండ‌ను ఎప్పుడూ ఖాళీగా ఉంచ‌కూడ‌దు. అలాగే గ్ర‌హ దోశాల‌ను నివారించ‌డానికి మ‌ట్టి పాత్ర‌ల‌ను వాడితే మంచి జ‌రుగుతుంది. అలాగే కొత్త కుండ తేవగానే నీళ్లు నింపి చిన్న‌పిల్ల‌ల‌కు ఇస్తే ఇంట్లో ఐశ్వ‌ర్యం ఉంటుంద‌ని న‌మ్మ‌కం. అంతే కాకుండా మ‌ట్టికుండ‌ను ఉత్త‌రం దిశ‌కు ఉంచితే ఆర్థికంగా బ‌ల‌ప‌డి కుబేరుడి అనుగ్ర‌హం పొందుతారు.

మ‌ట్టికుండ‌లోని నీళ్లు తాగితే ఇంట్లో స‌భ్యుల మ‌ధ్య సానుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయి. మట్టి కుండలోని నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఎండాకాలంలో మట్టి కుండలో నీరు తాగడం వల్ల ఎన్నో రకాల పోషకాలు కూడా అందుతాయి. ఈ మట్టి కుండలో నీరు ఒక గ్లాసు తాగిన చాలు చల్లని అనుభూతి కలగడంతో పాటు కడుపు నిండిన అనుభూతి కూడా కలుగుతుంది. ఈ మధ్యకాలంలో మట్టి కుండల వాడకం గురించి తెలుసుకున్న చాలామంది ఎక్కువగా ఇండ్లలో మట్టి పాత్రలనే ఉపయోగిస్తున్నారు.