Site icon HashtagU Telugu

Teeth Pain: పంటి నొప్పిని భరించలేకపోతున్నారా.. అయితే జామ ఆకులతో ఇలా చేయాల్సిందే!

Mixcollage 12 Jan 2024 07 03 Pm 171

Mixcollage 12 Jan 2024 07 03 Pm 171

కాలం మారిపోవడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి కూడా మారిపోయాయి. దాంతో మనుషులు అనేక రకాల అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అలా ఎక్కువ శాతం మంది బాధపడుతున్న సమస్యలలో పంటి నొప్పి సమస్య కూడా ఒకటి. పంటి నొప్పికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా ఒకటి. అయితే పంటి నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. ఎటువంటి వస్తువులు తినాలి తాగాలి అన్నా కూడా భయపడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు పంటి నొప్పిని ఏ విధంగా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పంటి నొప్పిని తగ్గించడంలో జామ ఆకులు ఎంతో బాగా ఉపయోగపడతాయి. జామ ఆకులు పంటి నొప్పులకు త్వరగా, స్వల్ప కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి. అందుకోసం లేత జామ ఆకును ఎంచుకుని నమలడం లేదా ఆకుల కషాయం చేసుకొని తాగితే పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. జామ ఆకులను నీటిలో మరగబెట్టి, మరిగించిన ద్రావణంలో ఉప్పు వేసి మౌత్ వాష్ గా కూడా ఉపయోగించవచ్చు. చిగుళ్ల వ్యాధి వంటి నోటి సంబంధిత ఇన్ఫెక్షన్లను అన్నింటినీ తగ్గించటంలో జామ ఆకులు ఎంతో సమర్థవంతంగా పని చేస్తాయి. లేత జామ ఆకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడగాలి.

ఆ కడిగిన ఆకులను నోట్లో వేసుకుని కచ్చా పచ్చా నమలాలి. ఇలా నమిలితే ఆకులోని రసం నోట్లోకి వస్తుంది. ఈ రసాన్ని ప్రతి పంటికి తగిలేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు వేచి చూడాలి. అనంతరం ఆ రసాన్ని బయటకు ఉంచేయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే పంటి నొప్పుల నుండి త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది. జామ ఆకుల్లోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు నొప్పి నుండి తాత్కాలిక ఉపశమనం అందిస్తుంది. జామ ఆకులు నోటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. జామ ఆకులను నమలడం అందరికీ కుదరక పోతే అలాంటప్పుడు జామ ఆకులతో కషాయం చేసుకొని వాటితో నోరు పుక్కిలించుకోవచ్చు.

కాగా జామ ఆకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. జామ ఆకుల మౌత్ వాష్ చిగుళ్ల వాపును తగ్గించడంలో మరియు ఫలకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. జామ ఆకులతో మౌత్ వాష్ ను సిద్ధం చేయడానికి, మొదట 5-8 లేలేత జామ ఆకులను మెత్తగా చూర్ణం చేసి, 1 గ్లాసు వేడి నీటితో కలపాలి. ఆ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు బాగా మరగబెట్టాలి. తరువాత మెల్లిగా చల్లబరచాలి. కొంచెం ఉప్పు కలిపిఆ రసాన్ని మౌత్ వాష్‌గా వాడొచ్చు. ఈ రసం పంటి నొప్పిని ఎదుర్కోవడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తోంది. మౌత్ వాష్ ఇంట్లోనే తయారయిపోతుంది.