Site icon HashtagU Telugu

Health Benefits: ఏంటి.. పొట్లకాయ వల్ల ఆరోగ్యానికి అన్ని రకాల ప్రయోజనాలా!

Mixcollage 29 Dec 2023 05 59 Pm 5643

Mixcollage 29 Dec 2023 05 59 Pm 5643

పొట్లకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పొట్లకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.. కొందరు పొట్లకాయతో చేసిన వంటలు లొట్టాలు వేసుకొని తింటే మరికొందరు తినడానికి అసలు ఇష్టపడరు. కాగా పొట్లకాయ మధుమేహం ఉన్నవారికి ఎంతో బాగా పనిచేస్తుంది. అలాగే కామెర్లతో ఇబ్బంది పడే వారికి ఈ పొట్లకాయ జ్యూస్ ఒక స్పూను నిత్యం మూడుసార్లు తీసుకున్నట్లయితే దీని నుండి మంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే అధిక బరువుతో బాధపడే వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పొట్లకాయలు పీచు పదార్థం, నీరు పుష్కలంగా ఉంటాయి. ఈ పొట్లకాయలు విటమిన్ ఏ బి సి మాంగనీస్ క్యాల్షియం ఐరన్ మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

ఈ పొట్లకాయలో ఉండేటువంటి మెగ్నీషియం రక్తపోటును నివారించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిస్తుంది. అలాగే మలబద్ధకం, గ్యాస్, కడుపుబ్బరం లాంటి సమస్యల నుండి కాపాడుతుంది. ఈ పొట్లకాయను నిత్యము దీని రసాన్ని ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలుపుకొని సేవించినట్లయితే ఈ వ్యాధులను నివారిస్తుంది ఈ పోట్లకాయ రసం. అందుకే ఈ పొట్లకాయని తీసుకోవడం వలన బయటికి నెట్టేసి కిడ్నీలను పనితీరు మెరుగుపడేలా చేస్తుంది. అలాగే విటమిన్ డి కాల్షియం పుష్కలంగా ఈ పొట్లకాయలు ఉండడం వలన ఎముకలకి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిస్తుంది.

అదేవిధంగా జుట్టుకి సంబంధించి ఎన్నో ఇబ్బందులను పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ పొట్లకాయ జ్యూస్ ని తలపై బాగా అప్లై చేసి 30 నిమిషాల వరకు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం వలన చుండ్రు జుట్టు రాలే సమస్యలు తగ్గిపోతాయి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే సరిపోతుంది. ఇలా ఈ పొట్లకాయను అలాగే దీని జ్యూస్ ని తీసుకోవడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు.