Health Benefits: ఎర్ర జామపండు, తెల్ల జామ పండు.. రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

జామ పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనా

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 05:00 PM IST

జామ పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరతాయి. అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ మీ డైట్ లో జామ పండ్లను తప్పనిసరిగా చేర్చుకోవాల్సిందే. మామూలుగా మార్కెట్లో రెండు రకాల జామపండ్లు లభిస్తూ ఉంటాయి. అందులో ఒకటి ఎర్ర రంగు జామపండు మరొకటి తెలుపు జామపండు. ఈ రెండు జామకాయలు చూసినప్పుడు చాలామందికి ఒక సందేహం వ్యక్తం అవుతూ ఉంటుంది.

అదేమిటంటే ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా జామకాయ తింటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని నివారిస్తుంది. మనం తిన్న ఆహారం సులువుగా జీర్ణం అయ్యేలా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో జామకాయ బాగా సహాయపడుతుంది.

అలాగే జామ పండ్లలో ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎరుపు రంగు జామలో నీటి శాతం ఎక్కువగా, చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. తక్కువ పిండి పదార్థాలు ,విటమిన్ సి ఉంటాయి. తెల్ల జామలో ఎక్కువ చక్కెర, స్టార్చ్, విటమిన్ సి, ఎక్కువ గింజలు ఉంటాయి. తెల్ల గుజ్జు జామలో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎరుపు రంగు జామకాయలో ఇంకా ఎక్కువ శాతం ఉంటుంది. ఎరుపు జామలో సహజంగా లభించే కెరోటినాయిడ్ పదార్థం ఉంటుంది. పింక్ జామ పండులను సూపర్ ఫ్రూట్స్ అని పిలుస్తారు. వీటిలో విటమిన్స్ ఏ,సిల ఒమేగా త్రీ ఒమేగా 6, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. చక్కెర వ్యాధి ఉన్నవారికి జామకాయ బాగా ఉపయోగపడుతుంది.