వైట్ చాకోలెట్ ఈ పేరుని విని ఉంటాం చూసి కూడా ఉంటాం. ఈ వైట్ చాకోలెట్ అనే పదార్థాన్ని పాలు అలాగే ఇతర పదార్థాలతో తయారు చేస్తూ ఉంటారు. అలా వాటి నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఏ వైట్ టీ. అయితే ఈ వైట్ టీని తాగమని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డాక్టర్లు సైతం సూచిస్తున్నారు. అయితే మామూలుగా టీని ఎక్కువగా తాగద్దు అని చెబుతూ ఉంటారు. కానీ ఈ టీని రోజుకి మూడుసార్లు తాగవచ్చట. అలా తాగడం వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అయితే దీనికి వైట్ టీ అనే పేరు ఎలా వచ్చింది అన్న విషయాన్నికొస్తే..
తేయాకు చిగురులఫై ఉండే చిన్నది తెల్లని ముక్కలను ఈ వైట్ టీ లో ఉపయోగిస్తూ ఉంటారు. బ్లాక్ టీ, గ్రీన్ టీల్లో ఉండేంత కెఫైన్ కంటే ఇందులో తక్కువ కెఫైన్ ఉంటుంది. చిగురు ఆకులతో తయారుచేసే ఈ వైట్ టీలో ఎక్కువ పోషకాలు ఉంటాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ పోషకాలు మన శరీరంలో విష వ్యర్థాల్ని తరిమికొట్టి మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయట. ప్రస్తుతం డార్జిలింగ్ వైట్ టీ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే దీని గురించి చాలా మందికి తెలియదు. కానీ ఈ టీ మహిళలకు అత్యంత ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తుందని అంటున్నారు. అలాగే ఈ టీ తయారీకి కూడా ఎక్కువ సమయం పట్టదు.
ప్రస్తుతం ఆన్ లైన్ మార్కెట్‌లో వైట్ టీ బ్యాగ్స్, ప్యాకెట్లు లభిస్తున్నాయి. దాదాపుగా ఒక్కో టీ బ్యాగ్ రూ.20 వరకు ఉంటోంది. ఈ వైట్ టీ తయారీ విధానానికి వస్తే.. 200ml నీటిని 5 నిమిషాలు ఉడికించాలి. ఆ తరువాత అందులో వైట్ టీ బ్యాగ్ వెయ్యాలి. రెండు నిమిషాల్లో అందులోని సారం నీటిలో చేరుతుంది. దీనికి తీపిదనం కోసం చక్కెర లేదా తేనె కలుపుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు తేనె కలుపుకుంటే ప్రయోజనం ఉంటుంది. చక్కెర లేదా తేనె కలిసిన తర్వాత వైట్ టీ రెడీ అయిపోయినట్లే.