Weight Loss: త్వరగా ఆహారం తింటే బరువు తగ్గుతారా? వైద్యులు చెబుతున్న విషయాలు ఇవే!

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో లావుగా ఉండటం అనేది ప్రధాన సమస్యగా

  • Written By:
  • Publish Date - September 4, 2022 / 06:30 PM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో లావుగా ఉండటం అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవనశైలిలో మార్పులు ఆహారపు అలవాట్లు మార్పుల కారణంగా బరువు పెరిగి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గడం కోసం జిమ్ కీ వెళ్లడం,వ్యాయామాలు చేయడం ఫుడ్ సరిగా తినకపోవడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇంకొందరు అయితే ఫుడ్ తినకపోతే బరువు తగ్గుతారు అని పిచ్చి పిచ్చి పద్ధతులను ఫాలో అవుతూ లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. మరి బరువు తగ్గాలంటే ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి చాలామంది ఆహారం తినకుండా ఉంటారు. కానీ ఆహారం తినకుండా ఉండటం మంచిది కాదు. శరీరానికి సరిపడినంత శక్తిని అందించే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఆహారం తినకుండా ఉండడం కంటే ఇంట్లో చేసిన వంటలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. నూనెతో తీపి తో తయారుచేసిన పదార్థాలను మితంగా తీసుకోవడం మంచిది. అలాగే శరీరానికి కావాల్సినన్ని నీళ్లు తాగాలి. రాత్రి సమయాలలో చాలామంది లేవాల్సి వస్తుంది అని నీళ్ల తాగకుండా అలాగే పడుకుంటూ ఉంటారు. అలా చేయకుండా దాహం వేసినప్పుడు నీరు తాగి పడుకోవాలి. అలాగే కీరదోస,నిమ్మకాయ ముక్కలు,పుదీనా ఆకులు వంటివి కలిపిన నీటిని తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.

అలాగే రాత్రిపూట తక్కువ భోజనం తీసుకోవడం అన్నది మంచి పద్ధతి అయినప్పటికీ మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే నీరసం రాకుండా చూసుకోవాలి. అలాగే జిమ్ వంటివి చేయకపోయినా కూడా నడక, ఈత, టెన్నిస్ వంటివి చేయడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. అలాగే రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోవడం లేటుగా తినడం అన్నవి కూడా మంచిది కాదు. ఇటువంటి జీవనశెలికి అలవాటు పడితే క్రమముగా బరువు పెరిగి ఊబకాయానికి దారి తీయవచ్చు. అందుకే రాత్రి సమయంలో ఎనిమిది గంటల లోపు తిని సమయానికి నిద్రపోవాలి. అలాగే కాఫీలకు,టీలకు బదులుగా గ్రీన్ బ్లాక్,వైట్, టీలు తాగడం అలవాటు నేర్చుకోవాలి.