Site icon HashtagU Telugu

Water Melon: వేసవిలో పుచ్చకాయని తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే?

Mixcollage 25 Feb 2024 05 42 Pm 4174

Mixcollage 25 Feb 2024 05 42 Pm 4174

సమ్మర్ లో మనకు ఎన్నో రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. వాటిలో పుచ్చకాయ కూడా ఒకటి. ఎక్కువ శాతం మంది సమ్మర్ లో పుచ్చకాయను తినడానికి ఇష్ట పడుతూ ఉంటారు. అంతేకాకుండా రోడ్డుకు ఇరువైపులా మార్కెట్లలో మనకు ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా పుచ్చకాయ కనిపిస్తూ ఉంటుంది. ఈ పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది. అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయ మంచిదే కాదా అని చాలామంది సమ్మర్ లో తెగ తినేస్తూ ఉంటారు. కానీ అలా ఎక్కువగా తినడం మంచిది కాదు అంటున్నారు వైద్యులు. మరి పుచ్చకాయను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వేసవి తాపం నుంచి రక్షించే పండ్లలో పుచ్చకాయ మొదటి స్థానంలో ఉంటుంది. చల్లదనంతో పాటు, తాజాగా తినగలిగే పండు ఇది ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. వీటి విత్తనాలు కూడా చాలా రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి. పుచ్చ గింజలు ఐరన్, పొటాషియం, విటమిన్లతో నిండి ఉంటాయి. పుచ్చపండుతో పాటు గింజలను తినడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అతిదాహం, చెమట ద్వారా వచ్చే ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. జ్వరంతో బాధపడేవారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి తీసుకుంటే నీరసం తగ్గి తక్షణ శక్తి పుంజుకుంటారు. మలబద్ధకం ఉన్నవాళ్లు ప్రతిరోజూ తింటే సమస్య తగ్గుతుంది. పెదవుల్లో తేమ తగ్గకుండా కాపాడుతుంది. ఈ పండులో ఉన్న నీటి శాతం వల్ల మూత్రం సరిగ్గా రానివారు, మూత్ర విసర్జనలో మంట ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

పుచ్చపండు గింజలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పుచ్చకాయలను తరచూ తీసుకోవడం వల్ల చర్మ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ వంటి చర్మ రుగ్మతలు తగ్గుముఖం పడతాయి. వేసవి కాలంలో విరివిగా దొరికే వీటిలో బి విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఎలక్ట్రోలైట్లు కూడా సమృద్ధిగా అందుతాయి. ఇందులో ఉండే బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే. పొటాషియం గుండెకుమేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం కాకుండా కాపాడుతుంది. సౌందర్య పోషకంగా కూడా పుచ్చకాయ రసం ఉపయోగపడుతుంది. వేసవి కారణంగా కమిలినట్లు తయారయ్యే చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జు రాస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది… గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గుతాయి. పుచ్చపండు గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాదు, గుండె సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్లు తగ్గి, జీవక్రియ సజావుగా జరుగుతుంది.

Exit mobile version