Site icon HashtagU Telugu

Watermelon: వేసవికాలంలో పుచ్చకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Watermelon

Watermelon

సమ్మర్ వచ్చింది అంటే చాలు మనకు మార్కెట్లలో ఎక్కడ చూసినా కూడా పుచ్చకాయలు ఎక్కువ మొత్తంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ పుచ్చకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సమ్మర్ లో వచ్చే చాలా రకాల సమస్యల నుంచి బయట పడేస్తాయి. వేసవి తాపం నుంచి రక్షించే పండ్లలో పుచ్చకాయ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. చల్లదనంతో పాటు, తాజాగా తినగలిగే పండు ఇది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయట. వీటి విత్తనాలు కూడా చాలా రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయట.

పుచ్చ గింజలు ఐరన్, పొటాషియం, విటమిన్లతో నిండి ఉంటాయని చెబుతున్నారు. పుచ్చ పండుతో పాటు గింజలను తినడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చట. మలబద్ధకం ఉన్నవాళ్లు ప్రతిరోజూ తింటే సమస్య తగ్గుతుంది. పెదవుల్లో తేమ తగ్గకుండా కాపాడుతుందట. ఈ పండులో ఉన్న నీటి శాతం వల్ల మూత్రం సరిగ్గా రానివారు, మూత్ర విసర్జనలో మంట ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అలాగే పుచ్చపండు గింజలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయట.

పుచ్చకాయలను తరచూ తీసుకోవడం వల్ల చర్మ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ వంటి చర్మ సమస్యలు తగ్గుముఖం పడతాయట. అలాగే ఈ కాయ వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం కాకుండా కాపాడుతుందట. సౌందర్య పోషకంగా కూడా పుచ్చకాయ రసం ఉపయోగపడుతుందట. వేసవి కారణంగా కమిలినట్లు తయారయ్యే చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జు రాస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుందట. గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండె జబ్బులు, మూత్ర పిండాల సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. పుచ్చపండు గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుందట. అంతేకాదు, గుండె సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్లు తగ్గి, జీవక్రియ సజావుగా జరుగుతుందని చెబుతున్నారు. అయితే పుచ్చకాయ మంచిదే కానీ అలా అని ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదని చెబుతున్నారు.