Water Apple: వాటర్ యాపిల్ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే?

  • Written By:
  • Publish Date - February 29, 2024 / 11:30 AM IST

వాటర్ యాపిల్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ వాటర్ యాపిల్ ని జీడి మామిడి అని కూడా పిలుస్తూ ఉంటారు. డిసెంబర్, జనవరిలో ఈ వాటర్ ఆపిల్ పండు మనకు అందుబాటులోకి వస్తాయి. ఇది మనం గ్రామాల్లో చెట్టు పెంచ్చుకోవచ్చు ఈ మొక్కలు నర్సరీలలో దొరుకుతాయి. అంట్లు దొరుకుతాయి. మొక్కలు దొరుకుతాయి. ఈ చెట్టు ఒక పది అడుగుల ఎత్తు ఉంటుంది. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంది. కాల్షియం ఉంది. విటమిన్ బి వన్ ఉంది. విటమిన్ బి టు రైబో ఫ్లెవెన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింకు, విటమిన్లు ఉన్నాయి.

ఎన్నోరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటర్ యాపిల్ కి. మొట్టమొదటిది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో బ్యాక్టీరియా, వైరస్ ,ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటు వ్యాధులు ప్రబలకుండా చేస్తుంది. వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, క్షయ వ్యాధి, టీవీ స్పాంజ్లా ఉండే ఊపిరితిత్తులు గడ్డకట్టుకునే నిమోనియా లాంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. వైరస్ల వల్ల సంక్రమించే వ్యాధులను అడ్డుకట్ట వేస్తుంది. గ్యాస్ ట్రబుల్ నివారిస్తుంది. ఇది దీనిలో పీచు ఉంటుంది. పీచు వల్ల దీన్ని పైన ఉన్న తోలు తో సహా తినాలి. కోస్తే లోపల గింజ ఉండదు.

తోలుతో సహా కండ కూడా తినొచ్చు. రుచి కూడా బానే ఉంటుంది. మలబద్ధకం ఉన్నవారికి మొలలు మూలశంక పైల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమస్య కూడా తగ్గుతుంది. విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి ఈ పండు కనిపిస్తే వదలకండి. అయితే ఈ మధ్యకాలంలో ఈ పండ్ల వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో మార్కెట్లో అలాగే ఆన్లైన్ స్టోర్లలో కూడా లభిస్తున్నాయి.