Site icon HashtagU Telugu

Warm Water: గోరువెచ్చని నీటిలో ఈ నాలుగింటిని కలుపుకొని తాగితే చాలు.. ఆ సమస్యలన్నీ పరార్?

Mixcollage 17 Feb 2024 08 49 Pm 8982

Mixcollage 17 Feb 2024 08 49 Pm 8982

మామూలుగా శీతాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాంతో తొందరగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. అందుకే శీతాకాలంలో ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహించాలని చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు వహించాలి. మన వంటింట్లో దొరికే దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, కొత్తిమీర ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడ్డాయి. వీటిని ఆహారం రుచిని పెంచడానికి సుగంధ ద్రవ్యాలుగా ఉపయోగిస్తారు. అయితే ఆయుర్వేదంలో ఈ నాలుగు పదార్థాలను ఔషధంలా ఉపయోగిస్తారు.

ఈ పదార్థాలలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి అనేక సమస్యల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. దాల్చిన చెక్క, లవంగాలు , జీలకర్ర, కొత్తిమీర నీటిలో వేసి కలపడం ద్వారా కషాయం లాగా తయారు చేసుకొని తాగితే రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శీతాకాలంలో వచ్చే సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ప్రతి రోజు జీలకర్ర, కొత్తిమీర, లవంగాలు, దాల్చిన చెక్క నీళ్లలో వేసి బాగా మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు దూరం అవుతాయి. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం.

అందుకోసం ఆ నాలుగు పదార్థాలతో చేసిన పానీయాన్ని తీసుకోవడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అలాగే మన శరీరంలో ఉన్న చెడు వ్యర్థాలను తొలగిపోవాలంటే ప్రతిరోజు ఈ గోరు వెచ్చని కషాయాన్ని త్రాగటం వలన శరీరంలో ఉన్న చెడులన్నీ తొలగిపోయి శరీరం శుభ్రం అవుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర , కొత్తిమీర తో కలిపి చేసిన కషాయాన్ని ప్రతిరోజు ఉదయం పరిగడుపున తీసుకోవడం వలన ఈజీగా బరువు తగ్గుతారు. ఈ నాలుగు పదార్థాలు శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి.