Tulsi benefit: తులసి ఆకులతో, విత్తనాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో?

భారత దేశంలో హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు. అంతేకాకుండా ప్రతిరోజు తులసి మొక్కకు పూజలు కూడా చేస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - September 3, 2022 / 01:15 PM IST

భారత దేశంలో హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు. అంతేకాకుండా ప్రతిరోజు తులసి మొక్కకు పూజలు కూడా చేస్తూ ఉంటారు. తులసీ మొక్కను సర్వరోగ నివారిణి అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే తులసి మొక్క వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఆయుర్వేదంలో ఈ తులసి మొక్కను కూడా ఉపయోగిస్తున్నారు. కేవలం తులసి ఆకులు మాత్రమే కాకుండా తులసి విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలుని కలిగిస్తాయి. మరి తులసి ఆకుల వల్ల విత్తనాల వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తులసి ఆకులు తినడం వల్ల కఫం తగ్గిపోతుంది. అదేవిధంగా తులసి రసాన్ని తరచుగా తాగడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. తులసి రసాన్ని మిరియాలతో పాటు కలిపి తీసుకుంటే మలేరియా లాంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే పిల్లలకు ఎక్కువగా వాంతులు అవుతున్నప్పుడు కొంచెం పెరుగుతో పాటు తులసి విత్తనాలు కలిపి ఇస్తే వాంతులు తొందరగా తగ్గిపోతాయి. ఇక తులసి మొక్క ఒక విత్తనాల విషయానికి వస్తే.. తులసి విత్తనాల్లో ఐరన్, విటమిన్ కె, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.

ఈ విత్తనాల్లో ఉండే ఐరన్ కారణంగా రక వృద్ధి బాగా జరుగుతుంది. తులసి గింజలను ప్రతి రోజు తినడం వల్ల కొల్లాజోన్ విడుదల పెరుగుతుంది. అలాగే దెబ్బతిన్న చర్మ కణాలు తొలగిపోయి.. కొత్త కణాలు రావడంలో తులసి విత్తనాలు కీలకపాత్ర వహిస్తాయి. తులసి ఆకులను పరగడుపునే తినడం వల్ల రక్తం బాగా తయారవుతుంది. తద్వారా రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.