Tulasi Water: పరగడుపున తులసి కషాయం తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే?

తులసి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతో పాటు పూజలు

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 09:30 PM IST

తులసి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతో పాటు పూజలు కూడా చేస్తూ ఉంటారు. తులసి మొక్క కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో ఈ తులసి ఆకులను వినియోగిస్తూనే ఉన్నారు. తులసిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే తులసి కషాయం వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పరగడుపున తులసి కషాయం తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.

మరి తులసి కషాయం పరగడుపున తీసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తులసి కషాయం ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుందిం అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్లు కరిగిపోతాయి. అల్లం రసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. పొట్టలో ఉండే నులి పురుగులు నసిస్తాయి. జలుబు చేసినప్పుడు తేనెలో ఒక టేబుల్ స్పూన్ తో తులసి రసం కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది. బెల్లంతో తులసి ఆకులు కలిపి తింటే కామెర్లు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా తులసి ఆకులు జ్వరాన్ని తగ్గిస్తుంది.

అల్సర్ల నుండి రక్షిస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా నియంత్రిస్తుంది. కాలేయం శక్తివంతంగా పనిచేయడానికి దోహదపడుతుంది. నోటి నుండి దుర్వాసన వెలువడకుండా నిషేధిస్తుంది. అలర్జీలు, పొగ ,దుమ్ము నుండి శరీరానికి కలిగే హానిని అరికడుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. దాదాపు అందరూ ఇళ్లలోనూ ప్రధాన ద్వారానికి ఎదురుగా తులసి మొక్క ఉంటుంది. ఎందుకంటే తులsసి ఆకుల నుంచి వచ్చే సువాసన ఇల్లంత పరుచుకొని మంచి యాంటీబయోటికగా పని చేస్తూ వ్యాధులు రాకుండా చేస్తుందని నమ్మకం అందుకే చాలా దేవాలయాలలో తీర్థంలో తులసి దళాలను వేస్తారు.