Site icon HashtagU Telugu

Jaggery Tea: బెల్లం టీ వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Mixcollage 06 Dec 2023 05 43 Pm 2073

Mixcollage 06 Dec 2023 05 43 Pm 2073

ప్రస్తుత రోజుల్లో మనుషులు టీ, కాఫీలకు బాగా అడిక్ట్ అయిపోయిన విషయం తెలిసిందే. ఉదయం నుంచి సాయంత్రం లోపు కనీసం రెండు మూడు సార్లు తాగేవారు ఉన్నారు. అంతకంటే ఎక్కువసార్లు టీ తాగేవారు కూడా ఉన్నారు. అలాంటి కాఫీలకు బానిసలుగా మారిపోయారు. అయితే టీ కాఫీ ఇలా ఏదైనా కూడా అందులో పంచదార వేసుకోవడం అన్నది కామన్. కానీ ఈ పంచదారకు బదులుగా బెల్లం వేసుకుని తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. బెల్లం టీ రుచికరమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనం కరంగా ఉంటుంది. బెల్లం టీ తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

కొంతమంది రక్తహీనత సమస్యతో బాధ పడుతూ ఉంటారు. దీనిని తగ్గించుకోవడం కోసం పాలు, బెల్లం టీ ఉత్తమ పరిష్కారం. బెల్లంలో ఐరన్ కంటెంట్ కారణంగా బెల్లం టీ తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఈ టీలో బెల్లంతో పాటు కొద్దిగా అల్లం, మిరియాలు వేసుకొని త్రాగడం వలన మన శరీరంలోని రోగనిరోదక శక్తి మెరుగుపడటంతో పాటు ఇతర ఇన్ఫెక్షన్ నుంచి వచ్చే వ్యాధులతో పోరాడడానికి నిరోధక శక్తి చాలా బాగా సహాయపడుతుంది. బెల్లంలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ కూడా నశింపజేస్తుంది. బరువు తగ్గే క్రమంలో కొంతమంది టీ తాగడం మానేస్తుంటారు.

అయితే చక్కెరకు బదులు బెల్లం టీ తాగితే శరీరంలోని క్యాలరీలు తగ్గుతాయి. ఇది బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది..బెల్లంలోని ఖనిజాలు, విటమిన్లు అన్ని రకాల ఆరోగ్య ఉపయోగాలను కలగజేస్తుంది. బెల్లం టీ తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల ఎన్నో పొట్ట సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి..