Tamarind Seeds: చింతగింజలను తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

చింతపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. చింతపండును ఎన్నో రకాల కూరల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా చె

  • Written By:
  • Updated On - February 5, 2024 / 10:30 AM IST

చింతపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. చింతపండును ఎన్నో రకాల కూరల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే చాలా వరకు వంటకాలు చింతపండు లేనిదే అస్సలు పూర్తి కావు. అయితే మామూలుగా మనం చింతపండు తీసినప్పుడు మనకు చింత గింజలు లేదా చింత పిచ్చలు కనిపిస్తూ ఉంటాయి. కొందరు వాటిని బయటకు పారేస్తే ఇంకొందరు మాత్రం వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి చింతపండు కంటే చింతపండు గింజల్లోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు. చింతపండు గింజలను ఇదివరకటి రోజుల్లో ఎక్కువగా వినియోగించేవారు.

చింత గింజలను పొడి చేసి చిగుళ్ల మీద పళ్ల కింద రుద్దితే పళ్లలో ఏర్పడే సందులు కాని తుప్పుపట్టిన పళ్లు కానీ తెల్లగా మెరుస్తాయి. పంటి నొప్పి ఉన్నా కూడా చింత గింజల పొడి వల్ల పోతుంది. చిగుళ్లు కూడా దృఢంగా తయారవుతాయి. అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం కోసం, వంట్లో ఉన్న చెడు కొలెస్టరాల్ ను తగ్గించుకోవడం కోసం చింత గింజల రసాన్ని వాడితే బెటర్. చింతగింజలను నానబెట్టి ఆ నీటిని తాగితే బ్లడ్ షుగర్ లేవల్స్ నార్మల్ అవుతాయి. అంటే సహజసిద్ధంగా షుగల్ లెవెల్స్ ను చింత గింజల నీటి వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు.

చింత గింజలు షుగర్ లేవల్స్ ను కంట్రోల్ చేసే పాంక్రియాస్ ను రక్షిస్తాయి. దీంతో షుగర్ లేవల్స్ కూడా నార్మల్ లేవల్ కు వస్తాయి. అలాగే వీటిని ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలకు కూడా వినియోగిస్తూ ఉంటారు. చింతపండు గింజలు విరేచనాలను ఎదుర్కోవటానికి మీకు సహాయపడతాయి. చింతపండు మీ చర్మ ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగుపరుస్తుంది. చింతపండు మీ కీళ్లలో మంట నొప్పిని తగ్గిస్తుంది. చింతపండు గింజలు మీ దంతాలు చిగుళ్ళను క్షయం ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి.