Tamarind leaves: చింత చిగురు వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

  • Written By:
  • Updated On - February 18, 2024 / 03:58 PM IST

చింత చిగురు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ చింతచిగురును ఉపయోగించి ఎన్నో రకాల వంటలను కూడా తయారు చేస్తూ ఉంటారు. చింత చిగురు పప్పు, చింతచిగురు రొయ్యలు, చింత చిగురు చికెన్, చింతచిగురు పొడి ఇలా ఎన్నెన్నో వంటకాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ చింతచిగురు వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చింత చిగురులో కామెర్లను నయం చేసే గుణం ఉంటుంది. చింతచిగురు నుంచి రసాన్ని తీసి అందులో పటిక బెల్లం కలుపుకొని త్రాగితే కామెర్ల వ్యాధిని అదుపులోకి తీసుకురావచ్చు.

చింతచిగురును తీసుకోవడం వలన వాతం వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే మూల వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. చింత చిగురును తినటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు నొప్పి సమస్యలకు కూడా చింతచిగురును ఉపయోగించవచ్చు. చింతచిగురును నీటిలో మరిగించి వేడిగా ఉన్నప్పుడు నోటిలో వేసుకొని పుక్కిలించడం వలన గొంతు నొప్పి, గొంతువాపు, గొంతులో మంట వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే చింతచిగురును తినటం వలన కడుపులో నులిపురుగులు కూడా నశిస్తాయి.

ఇక థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు కూడా చింతచిగురును తినవచ్చు. చింతచిగురు థైరాయిడ్ ను అదుపులో ఉంచుతుంది. అలాగే రక్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది. చింతచిగురులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకుంటే వెంటనే జీర్ణం అవుతుంది. దీంతో గ్యాస్ మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. అలాగే రక్తహీనతతో బాధపడేవారు చింత చిగురు కచ్చితంగా తీసుకోవాలి. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలకు ఇది మంచి బలాన్ని ఇచ్చే ఆకుకూర.