Site icon HashtagU Telugu

Sweating in Summer : చెమటలు ఎక్కువగా పట్టడం ఆరోగ్యానికి మంచిదేనా ?

health benefits of sweating

health benefits of sweating

Sweating in Summer : వేసవిలో చెమటలు.. కాదు కాదు.. ముచ్చెమటలు పట్టడం కామన్. వేసవికాలం వస్తుందంటేనే అంతలా భయపడిపోతుంటారు. మార్చి నెలైనా మొదలు కాకుండానే సూరీడు నిప్పులు చెరుగుతాడు. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే చెమటలు ఎక్కువగా పట్టడం శరీరానికి మంచిదా కాదా అన్నదానిపై చాలా మందికి సందేహాలుంటాయి. శరీరం నుంచి చెమట బయటకు రావడం మంచిదే. ఇది శరీరంలో ఉన్న అధిక వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. కేవలం వేడివల్లే కాకుండా.. ఇతరత్రా పరిస్థితుల్లోనూ చెమట పడుతుంది. అలాంటి చెమట ఆరోగ్యానికి మంచిది కాదు.

భయం, ఆందోళన, టెన్షన్, బీపీ తగ్గినపుడు, షుగర్ లెవల్స్ పడిపోయినపుడు కూడా శరీరమంతా చెమట పడుతుంది. ఇలా బీపీ, షుగర్ తగ్గినపుడు చెమట రావడం మంచిది కాదు. కాబట్టి.. వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఈ రెండు సందర్భాల్లో చెమట పడితే జాగ్రత్తగా ఉండాలి. రోజులో కొంత సమయం పాటు శరీరానికి చెమట పట్టడం గుండెకు మంచిది. చెమట రక్తం నుంచి విషాన్ని, ఉప్పును తొలగిస్తుంది. అంతేకాదు.. స్వేద రంధ్రాలలో పేరుకుపోయిన ధూళి, బ్యాక్టీరియా వంటివాటిని కూడా బయటకు పంపుతుంది. చర్మ రక్షణకు, కాంతికి చెమట సహాయపడుతుంది.

అయితే.. అధికంగా చెమట పట్టినపుడు డీహైడ్రేషన్ కు గురవుతారు. ఇది కిడ్నీలకు మంచిదికాదు. అందుకే రోజులో నీరు ఎక్కువగా తాగుతుండాలి. చెమట ద్వారా శరీరంలోని విషపూరిత పదార్థాలు బయటకు వెళ్లిపోవడం ఆరోగ్యానికి మంచిది. కాబట్టి చెమట శరీరానికి, ఆరోగ్యానికి మంచిదే. వాసన వస్తుందని, చిరాకుగా ఉంటుందని ఫీల్ అవ్వకండి. రోజూ ఉదయం, సాయంత్రం స్నానం చేయడం అలవాటు చేసుకోండి. కాస్త రిలీఫ్ గా ఉంటుంది.

Read Also : Summer: సమ్మర్ లో అలసటకు గురవుతున్నారా.. కాసిన్ని కొబ్బరి నీళ్లు తాగితే రోజంతా జోష్